Begin typing your search above and press return to search.
రైతుకు రూ.2.. ప్రపంచవ్యాప్తంగా భగ్గు.. మనకు 20.. ఉల్లిధర కథేంటి?
By: Tupaki Desk | 5 March 2023 7:00 PM GMTఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.. కానీ ఇప్పుడు ఉల్లిధరలు రైతులకు కీడు చేస్తున్నాయి.. ఆరుగాలం పంట పండించిన రైతులకు కనీస ధర కూడా రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. కొందరు పంటలను పొలాల నుంచి మార్కెట్ కు తీసుకెళ్లడానికి రవాణా ఖర్చులు దండుగ అని అక్కడే పారబోస్తున్నారు. ఒకప్పుడు కరోనా కాలంలో కిలో ఉల్లి కావాలంటే క్యూ కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ధరలేక రైతులు వాటిని రోడ్డుపై పారబోస్తున్నారు. అసలు ఉల్లిధర ఇంతగా పడిపోవడానికి కారణమేంటి? అసలేం జరుగుతోంది.
ఉల్లి ధర ఉన్నట్టుండి కిలో రూ.2 కు పడిపోయింది. ఇటీవల ఓ రైతు తన ఉల్లిపంట మొత్తాన్ని మార్కెట్ కు తీసుకెళ్తే అయనకు వచ్చిన మొత్తం రూ.2. దీంతో కొందరు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అత్యధిక ఉల్లి పండే మహారాష్ట్రలోనూ ధరలు కిందికి రావడంతో దీనిపై ఆధారపడిన రైతులు, వ్యాపారులు లబోదిబో మంటున్నారు. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ గా పేరుగాంచిన మహారాష్ట్ర లాసల్ గావ్ మార్కెట్లో ఫిబ్రవరి 9 వరకు క్వింటాల్ ఉల్లి ధర రూ.1000 నుంచి 1100 మధ్య పలకగా ఆనెల 27 నాటికి రూ.500కు పడిపోయింది.
ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.2కు విక్రయించడం చూసి అంతా షాక్ అవుతున్నారు. అయితే ఫిలిప్సీన్ దేశంలో ఉల్లి ధర కిలో రూ.1200. కానీ మన దేశంలో రూ.2. ఇలా వ్యత్యాసాలు ఉండడంతో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఉల్లి ధరలు ఎందుకు పడిపోయాయి? ఇంతలా ఉత్పత్తి రావడానికి కారణమేంటి? అన్న చర్చ సాగుతోంది.
ఉల్లి ధరలు పడిపోవడానికి కారణాలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఉల్లి ధరల్లో వ్యత్యాసాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఉల్లి రైతులు ఏడాదికి మూడు పంటలు పండిస్తారు. డిసెంబర్ లేదా జనవరిలో ఉల్లి నాట్లు వేస్తారు. దీని పంట మార్చి లేదా ఏప్రిల్ లో వస్తుంది. ఈ కాలాన్ని రబీ అంటారు. రబీ కాలంలో వచ్చిన పంటను ఒకేసారి విక్రయించరు. ఎక్కువగా నిల్వ చేస్తారు.
రబీ పంటను వేసవి నుంచి శీతాకాలం వరకు మార్కెట్ కు తీసుకువస్తారు. అయితే మార్కెట్లో ఉల్లి ధర నాణ్యతను భట్టి నిర్ణయిస్తారు. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఆ ప్రభావం నిల్వ ఉంచిన ఉల్లిపై పడింది. దీంతో అవి పాడయిపోతాయోననే భయంతో ఒకేసారి మార్కెట్ కు తీసుకు వచ్చారు. ఇలా పాత, కొత్త పంటలకు సంబంధించిన ఉల్లి ఒకేసారి మార్కెట్ కు రావడంతో ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఉల్లి పంట వాతావరణ మార్పులపై ఆధారపడుతుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే రైతులు ఎక్కువగా మార్కెట్ కు తీసుకొస్తారు. శీతాకాలంలో ఎక్కువగా నిల్వ చేస్తారు. ఇలా ఉల్లి ధరలు హెచ్చుతగ్గులవుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉల్లిధర పడిపోయినందున ప్రభుత్వం కొనుగోలు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో కొందరు ఉల్లి దండలతో వచ్చారు. ఇక పిలిప్పీన్స్ లో ద్రవ్యోల్భణం కారణంగా ఉల్లిధరలు కొండెక్కాయి. అక్కడ కిలో రూ.1200కు విక్రయిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.