Begin typing your search above and press return to search.

దుర్గగుడిలో పనిచేయడానికి అధికారులు ఎందుకు భయపడుతున్నారు?

By:  Tupaki Desk   |   9 April 2021 8:50 AM GMT
దుర్గగుడిలో పనిచేయడానికి అధికారులు ఎందుకు భయపడుతున్నారు?
X
విజయవాడ దుర్గగుడి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోందన్న ప్రచారం అక్కడి భక్తుల్లో వ్యక్తమవుతోంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారి ఇలాఖాలో పనిచేసే అధికారులు, సిబ్బంది నిత్యం ఏదో వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటున్నారు. అధికారులు ఈ దేవాలయంలో పనిచేయడానికే భయపడే పరిస్థితి నెలకొంది.ఇక్కడ ఏ ఈవో కూడా పట్టుమని రెండేళ్లు కూడా పనిచేయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

గత 10 సంవత్సరాల్లో 11 మంది ఈవోలు విజయవాడ దుర్గగుడిలో మారారంటే ఎంత వివాదాస్పదంగా వ్యవహారాలు నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన ఈవోల్లో దుర్గమ్మ ఆలయంలో నిర్వహించే దసరా వేడుకను ఒక్కరు కూడా రెండోసారి నిర్వహించిన చరిత్ర లేదంటే అతిశయోక్తి కాదేమో..

గడిచిన ఆరేళ్లలోనే ఏకంగా ఏడుగురు ఈవోలు మారారు. వచ్చిన ప్రతి ఈవో వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం వచ్చిన ఈవో కూడా అమ్మవారికి భక్తులు సమర్పించిన ఖరీదైన బంగారు పట్టుచీర మాయం అవ్వడం.. పాలకమండలి సభ్యురాలిపై ఆరోపణలు రావడంతో ఆ ఈవో కూడా బదిలీ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇక ఓ ఐఆర్ఎస్ అధికారిణిని ఈవోగా పెట్టినా చీరల కౌంటర్లలోని ఓ ఉద్యోగి 70 స్కామ్ చేయడంతో ఈమెను కూడా ట్రాన్స్ ఫర్ చేయాల్సి వచ్చింది.

విచిత్రం ఏంటంటే ఇక్కడకు వచ్చే వారిలో కొందరు అవినీతికి పాల్పడకుండా.. స్టిక్ట్ గా వ్యవహరించినా కూడా ఇతర వివాదాలు.. ఇతరులు చేసిన పనులు కారణంగానే బదిలీ అయిపోతుండడం గమనార్హం.

ఇక తాజాగా ఐఏఎస్ ను కాదని రూల్స్ మార్చి ప్రభుత్వం సురేష్ బాబును ఈవోగా నియమించింది. ఈయనకు ఆర్జేసీగా ప్రమోషన్ ఇచ్చింది. అయితే సురేష్ బాబు నియామకం అక్రమమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈయన ఎంత కాలం పదవిలో ఉంటాడన్నది వేచిచూడాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.