Begin typing your search above and press return to search.

అక్కడ అదానీ టార్గెట్... ఏపీలో రెడ్ కార్పెట్ ?

By:  Tupaki Desk   |   10 Feb 2023 8:00 AM GMT
అక్కడ అదానీ టార్గెట్... ఏపీలో  రెడ్ కార్పెట్ ?
X
ఈ రోజు అదానీ అన్న కార్పోరేట్ దిగ్గజం విషయంలో ప్రతిపక్షం అంతా ఏకమై పార్లమెంట్ ని స్టాల్ చేస్తోంది. ఆయన విషయంలో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. బడ్జెట్ సమావేశాలు మొదలైన తరువాత ఇదే తంతు సాగుతోంది. మరో వైపు అదానీ షేర్లు అన్నీ పతనావస్థకు చేరుకున్నాయి. అయినా సరే అదానికి ఏపీలో మాత్రం రెడ్ కార్పెట్ వేస్తూ వైసీపీ ప్రభుత్వం భూములను సంతర్పణ చేసింది అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో వందలాది భూములు అదానీ ప్రాజెక్టుల కోసం ఇచ్చారని అంటున్నారు. అయితే ఇంకా ఎక్కడా గ్రౌండింగ్ కూడా కాని విశాఖ వంటి చోట్ల అదానీ డేటా సెంటర్ పేరిట అరవై ఎకరాలు ఇవ్వడమేంటి అని విమర్శలు వస్తున్నాయి. అదే విధంగాటెక్ పార్క్ పేరుతో కూడా అదానీకి పెద్ద పీట వేశారు అని అంటున్నారు.

అనంతపురం జిల్లాలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ కోసం అక్కడ ఏర్పాటు చేయబోయే 500 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు 406.46 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇక్కడ ఎకరం రూ.5లక్షల చొప్పున కేటాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలపడం పైన కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే ప్రాజెక్టు కోసం కడప జిల్లాలో 470 ఎకరాలు, మన్యం పార్వతీపురం జిల్లాలో 362 ఎకరాలు, .ఇదే జిల్లాలో మరో 318 ఎకరాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

విశాఖలో అయితే డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం మరో 60.29 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. అదానీ ఇపుడు ఇబ్బందులో ఉన్నారు. ఆయన విషయంలో ఏమి చెప్పుకోవాలో తెలియక బీజేపీ పెద్దలు డైలామాలో ఉన్నారు. మరో వైపు అదానీది తప్పు లేదని దేశీయంగా విదేశీయంగా ఆయన్ని పట్టుకుని టార్గెట్ చేస్తున్నారు అని ఆరెస్సెస్ నేతలు అంటున్నారు

ఎవరు ఎంతలా అంటున్నా అదానీ ప్రకంపనలు అయితే ఢిల్లీలో గట్టిగా ఉన్నాయి. కానీ ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మాత్రం ఏపీ ప్రభుత్వం ఆయన మీద పన్నీటి జల్లులను కురిపించిందని అంటున్నరు. అదానీనికి ఏపీలో భూములను కేటాయించడం ద్వారా కొండంత ధైర్యాన్ని వైసీపీ ఇచ్చిందని అంటున్నారు. దీని మీద విపక్షాలు అయితే అంతులేని ప్రేమ తోనే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.

అయితే వైసీపీ నేతలు మాత్రం ఆయన ప్రాజెక్టులకు అవసరం అయిన భూములను నిబంధనల మేరకే కేటాయించామని అంటున్నారు. అదానీ ప్రాజెక్టులు ఏపీలో పట్టాలెక్కుతాయని కూడా అంటున్నారు. ఇపుడున్న టైం ని బట్టి చూస్తే అదానీకి ఒక కంట కన్నీరు మరో కంట పన్నీరు అన్నట్లుగా దేశమంతా ఎలా ఉన్నా ఏపీలో మాత్ర పారిశ్రామిక ప్రగతికి బాటలు పడుతున్నాయని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.