Begin typing your search above and press return to search.
ఉత్తరాంధ్రా లో సీటు చిరిగేది వారికేనా...?
By: Tupaki Desk | 30 Jun 2023 9:00 AM GMTఉత్తరాంధ్రాలో మూడు జిల్లాలు ఉన్నాయి. ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీ 2019 గెలిచినవి 28 సీట్లు. అంటే అత్యధిక శాతం ఆ పార్టీ సొంతం అన్న మాట. ఈ సీట్లలో 2024లో మళ్ళీ వైసీపీ టికెట్లు ఇచ్చేది ఎందరికి అన్నది చూస్తే క్లియర్ గా కొందరికి దక్కవనే అంటున్నారు.
వైసీపీ తరచూ చేయిస్తున్న సర్వేలు చూసుకుంటే గత ఏడాదిన్నరగా కొందరు ఎమ్మెల్యేల పనితీరు ఈ రోజుకీ మెరుగుపడలేదని అంటున్నారు. అదే సమయంలో కొందరు పార్టీ ఆదేశానుసారం గడప గడప కూ తిరుగుతున్నా కూడా వారి గ్రాఫ్ పెరగలేదు, అదే టైంలో ప్రతిపక్షం అక్కడ పైచేయిగా ఉందని తేలుతోంది.
దాంతో వారిని తప్పించే అవకాశాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ప్రచారం లో ఉన్న లిస్ట్ ఒకటి చూస్తే భీమిలీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కు టికెట్ కష్టమే అంటున్నారు. ఆయన పనితీరు బాలేదని నివెదికలు చెబుతుననయట. పైగా ఆయన కు టికెట్ ఇస్తే టఫ్ ఫైట్ ఇవ్వలేరు అన్న డౌట్లు ఉన్నాయని అంటున్నారు.
అదే విధంగా విశాఖ జిల్లాలో పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ఈసారి టికెట్ దక్కదని అంటున్నారు. ఆయన 2009, 2014, 2019లలో మూడు సార్లు అక్కడ నుంచి గెలిచారు. అయితే ఈసారి మాత్రం ఆయన గెలుపు కష్టమని సర్వేలు తేల్చిన నేపధ్యంలో గొల్ల బాబురావు కు హ్యాండ్ ఇసారని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే విజయనగరం లో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు సీటు కూడా చిరిగే చాన్స్ కనిపిస్తోంది అని అంటున్నారు. ఆయన సైతం టీడీపీ ని ధీటుగా ఎదుర్కోలేరు అని అంటున్నరు. ఆయన గ్రాఫ్ కూడా ఏ మాత్రం పుంజుకోలేదని అంటున్నారు.
అదే సమయంలో బొబ్బిలి రాజులు బాగా పుంజుకున్నారని అంటున్నారు. ఈసారి బొబ్బిలి నుంచి మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు సోదరుడు బేబీ నాయన పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన దూకుడుగా ఉన్నారని అంటున్నారు. అదే విధంగా చెప్పుకుంటే పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు సీటు కు కూడా ముప్పు ఉందని అంటున్నారు. ఆయన మీద జనం లో తీవ్రంగా వ్యతిరేకత ఉండాం తోనే ఈసారి సీటు కష్టమని తెలుస్తోంది. ఆయనకు పార్టీలో ప్రత్యర్ధులు తయారు కావడం, జనాల్లో అదరణ కూడా తగ్గడంతో తప్పిస్తారు అన్నది ప్రచారంలో ఉన్న మాట.
ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఎచ్చెర్లలో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కి ఈసారి టికెట్ దక్కదని తెలుస్తోంది. అక్కడ వైసెపీ గ్రాఫ్ బాగా డౌన్ అవుతోంది. సొంత పార్టీ వారే జగన్ ముద్దు గొర్లె వద్దు అనేస్తున్నారు. టీడీపీ ఇక్కడ స్ట్రంగ్ గా మారింది. దాంతో గొర్లెకు టికెట్ లేదనే శుభవార్త వినిపిస్తారు అని అంటున్నారు.
ఇక రాజాం లో కంబాల జోగులుకి టికెట్ కష్టమే అని తెలుస్తోంది. 2009లో ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన కంబాల జోగులు తొలి ప్రయత్నంలో ఓడారు. 2014, 2019లలో వైసీపీ నుంచి ఆయన గెలిచారు. అయితే ఆయన పట్ల జనం లో వ్యతిరేకత మెల్లగా పెరుగుతోంది. ఇక టీడీపీ లో ఉన్న మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహనరావు కు ఈసారి అవకాశాలు పెరుతున్నాయి. దాంతో కొత్త వారిని దింపాల ని వైసీపీ ఆలోచిస్తోందిట. ఈ పరిణామాల నేపధ్యంలో కంబాల జోగులు కు టికెట్ దక్కదనే అంటున్నారు.