Begin typing your search above and press return to search.
రేవంత్ కోసం చంద్రబాబే స్పాన్సర్ చేశాడా?
By: Tupaki Desk | 1 July 2021 3:30 AM GMTమనం పెట్టిన మొక్క ఎదిగి పూలు పూసి, పండ్లు కాచి ఆ పండు తింటే ఆ మజానే వేరు.. ఇప్పుడు చంద్రబాబు పెంచిన రేవంత్ రెడ్డి లాంటి నేతలు తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎదిగిన తీరు చూసి ఆయన అంతే ఫీల్ అవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గర్వంతో చంద్రబాబు ఉప్పొంగిపోతున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఇటీవల రాజకీయవర్గాల్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుందున్నాయి. పలతు చీకటి పదనిసలు కూడా బయటపడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే. 'ఓటుకునోటు'తో వీరి బంధం ఎంత స్ట్రాంగ్ నో బయట ప్రపంచానికి కూడా పరిచయమైంది.
ఇక తాజాగా తన శిష్యుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా గెలిచినందుకు చంద్రబాబు సంతోషంగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఇక రేవంత్ రెడ్డికి మద్దతుగా చంద్రబాబు శిష్యురాలు.. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఏకంగా 2వేల కార్లతో ర్యాలీ నిర్వహించడం చర్చనీయాంశమైంది. సీతక్కను చంద్రబాబే ప్రోత్సహించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నాడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిపించాడు. ఇప్పటికీ తన గాడ్ ఫాదర్ చంద్రబాబు అని.. ఆయన ఫొటోను తన ఇంట్లో పెట్టుకుంటుంది సీతక్క. కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబే దేవుడు అంటుంటుంది.
ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినా ఆయనకు టీడీపీతో ఉన్న సాన్నిహిత్యం బంధం ఎప్పటికీ తెగదు. ఈ క్రమంలోనే మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క సైతం రేవంత్ రెడ్డి పీసీసీ అయిన సందర్భంగా 2వేల కార్లతో పెద్ద ర్యాలీ తీశారు. అయితే అడవుల్లో చెప్పులు కూడా లేకుండా తిరిగే సీతక్క వద్ద ఇంత పెద్ద కార్ల ర్యాలీని భరించే స్తోమత లేదని అందరికీ తెలిసిన విషయమే.. ఈ ఖరీదైన ర్యాలీని ఆమె ఎలా నిర్వహించగలరని అందరి నుంచి ప్రశ్న వెలువడుతోంది. అయితే దీనికి కొంతమంది పెట్టుబడిదారులు ఖర్చు చేశారని ఈ స్పాన్సర్ చంద్రబాబునే అని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా అయితే కాంగ్రెస్ వారి కంటే టీడీపీ నేతలే తెగ సంబరపడుతున్నారన్న టాక్ నడుస్తోంది.