Begin typing your search above and press return to search.

ఎవరు మద్యం తాగాలి? ఎవరు తాగొద్దు? ఎంత తాగాలంటే?

By:  Tupaki Desk   |   8 April 2023 8:00 AM GMT
ఎవరు మద్యం తాగాలి? ఎవరు తాగొద్దు? ఎంత తాగాలంటే?
X
పొగతాగని వాడు దున్నపోతై పుట్టును అన్నాడు గిరీశం.. కానీ ఇప్పుడు మద్యం తాగని వాడు అసలు మనిషి కాదంటున్నారు నేటి యువ జనం. నూనుగు మీసాల యువకుడి నుంచి పండు ముదసలి వరకూ మద్యం తాగడం ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. ఆడ మగ తేడా లేకుండా తెగ తాగేస్తున్నారు.అయితే మద్యం ఎంత తాగాలి? తక్కువ తాగితే ఏం కాదా? అన్న దానిపై బోలెడన్నీ అనుమానాలు మన మెదళ్లలో ఇప్పటికీ తొలుస్తూనే ఉన్నాయి. దీనికి తాజా పరిశోధన ఒక కొత్త దారిని చూపించింది.

అప్పట్లో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించినప్పుడు మద్యం షాపులు బంద్ చేశారు. మందులేక ఎందరు పిచ్చివాళ్లు అయ్యారో మనం చూశాం. 43 రోజుల లాక్ డౌన్ సడలించిన తర్వాత మద్యం షాపుల ముందు కూడా మగువలు క్యూలు కట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతటి తాగుబోతుల సమాజంలో ఉన్న మనం ఇక మద్యాన్ని అంటరానితనంగా చూడలేం. అది మనలో ఒక భాగమైందనే అనుకోవాలి. అందుకే మద్యం పోటీలు భవిష్యత్తులో జరగొచ్చు. దేశంలోనే అత్యధిక మద్యం తాగే రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. ఏపీలో కూడా అత్యధిక మద్యం తాగేవాళ్లు ఉన్నారు.

అయితే మద్యం వల్ల అనర్థాలు అన్నీ ఇన్నీ కావు.. వాహన ప్రమాదాల నుంచి హింస, లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలకు ఈ మద్యం తాగడమే కారణం.. ఇక మద్యం అతిగా తాగితే గుండెపోటు, లివర్ ఖరాబ్, కిడ్నీలు ఫెయిల్, క్యాన్సర్ లు వచ్చిపడుతున్నాయి. అనేక దీర్ఘకాలిక రోగాలు చుట్టుముడుతున్నాయి. కొందరైతే భూమిలో బాగా పులియబెట్టిన మద్యం తాగితే ఏం కాదు అని ఫారిన్ నుంచి ఖరీదైన లిక్కర్ ను తీసుకొచ్చి మరీ తాగుతున్నారు. దీంతో అసలు మద్యపానం మితంగా తాగితే మంచిదేనా? అన్న దానిపై పరిశోధన జరిగింది.

మితంగా మద్యపానం తాగితే గుండె, రక్తప్రసరణ వ్యవస్థకు మంచిదని పరిశోధనలో తేలింది. మితంగా మద్యం తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్, పిత్తాశయ రాళ్ల నుంచి రక్షణలభిస్తుందని తేలింది. ఆల్కహాల్ అనేది క్రియాశీల పదార్థం. ఇది శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. తక్కువ తాగితే మంచిది.. అధికంగా తాగితే శరీర అవయవాలను దెబ్బతీస్తుంది. అలాగే మానసిక స్థితి, ఏకాగ్రత, సమన్వయాన్ని మారుస్తుంది.

-ఎవరు మద్యం తాగాలి? ఎవరు తాగొద్దు? ఎంత తాగాలంటే?

అమెరికాలో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం.. ఒక వయసు పురుషులు రోజుకు 2 లేదా అంతకంటేతక్కువ పెగ్స్ తీసుకొని మితంగా మద్యం తాగాలని సూచించింది. 21 ఏళ్లలోపు వారు మద్యం తాగవద్దని సూచించింది. అలాగే గర్భిణులు ఆ సమయంలో అసలు మందు ముట్టరాదు. వైద్యచికిత్స తీసుకుంటున్న వారు మద్యానికి దూరంగా ఉండాలి. పాలిచ్చే మహిళలు అసలు మద్యం ముట్టకపోవడం మంచిదని ఈ పరిశోధన నిగ్గు తేల్చింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.