Begin typing your search above and press return to search.

ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ల పంపిణీలో భారత్ ముందంజ..డబ్ల్యూహెచ్ వో ప్రశంసలు

By:  Tupaki Desk   |   27 Feb 2021 5:16 AM GMT
ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ల పంపిణీలో భారత్ ముందంజ..డబ్ల్యూహెచ్ వో ప్రశంసలు
X
భారత్ పెద్ద మనసు చేసుకొని ఇతర దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ల అందజేతపై డబ్ల్యూహెచ్ వో ప్రశంసలు కురిపించింది. వ్యాక్సిన్ల పంపిణీలో భారత్ సమానత్వం పాటిస్తోందని డబ్ల్యూహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ ప్రశంసించారు. ప్రపంచ దేశాలకు టీకా అందివ్వడంలో ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తోన్న సహకారం మరువలేనిదని ఆయన కొనియాడారు. వ్యాక్సినేషన్ పై భారత్ అనుసరిస్తున్న విధానాలపై టెడ్రోస్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

భారత్ కొన్ని నెలల కిందటే కరోనాకు విరుగుడుగా కోవాగ్జిన్ - కోవిషీల్డ్ టీకాలను సిద్ధం చేసింది. ఈ టీకాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముందుగా కరోనా ఫ్రంట్ లైన్ వారి యర్స్ కు ఇక అందజేసే కార్యక్రమం ప్రారంభించింది. జనవరి 16వ తేదీన తొలి దశ వ్యాక్సినేషన్ ప్రారంభం అయ్యింది. ఇది పూర్తి కాగా మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు.

కోవాగ్జిన్ - కోవిషీల్డ్ టీకాలను సిద్ధం చేసిన భారత్ టీకాను స్వదేశీయులకే కాదు ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తోంది. పేద దేశాలకు ఉచితంగా కరోనా టీకాలు అందజేస్తుండగా ధనిక దేశాలకు వ్యాక్సిన్లను విక్రాయిస్తోంది. ‘వ్యాక్సిన్‌ మైత్రి’ పేరిట పొరుగు దేశాలతో సహా ప్రపంచ దేశాలకు కరోనా టీకాలను పంపిణీ చేస్తోంది. మొత్తం 60 దేశాలకు భారత్ టీకాలను అందజేస్తోంది.

ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ భారత్ కరోనా వ్యాక్సిన్లు ఇతర దేశాలకు పంపిణీ చేయడం పై స్పందించారు. 'టీకా సమానత్వం కోసం మద్దతిస్తోన్న భారత్‌ - ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మీ సహకారంతో అరవై దేశాలలోని ప్రజలకు కరోనా టీకా అందుతోందని కొనియాడారు. మీరు చేస్తున్న పనిని ఇతర దేశాలు కూడా ఆదర్శంగా తీసుకుంటాయని' ఆయన అన్నారు.

భారత్ ఆఫ్రికా దేశాలకు తొలిదశ తీగ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. మొత్తం 6 లక్షల డోసులను ఘనా దేశానికి పంపిణీ చేసింది. భారత్ ఆఫ్రికాలోని దేశాలతోపాటు బంగ్లాదేశ్ 20 లక్షల డోసులు, నేపాల్ కు 10, భూటాన్ కు 1.5 లక్షలు - మయన్మార్ కు 17 లక్షలు - మాల్దీవులు - మారిషస్ కు లక్ష చొప్పున కరోనా డోసులను భారత్ పంపిణీ చేసింది. పేద దేశాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న భారత్ ధనిక దేశాలకు టీకాలను విక్రయిస్తోంది.