Begin typing your search above and press return to search.
పేద దేశాలకు టీకా ఇవ్వండి .. డబ్ల్యూహెచ్‌వో
By: Tupaki Desk | 27 March 2021 6:09 AM GMTప్రపంచవ్యాప్తంగా ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమై మూడు నెలల గడిచినప్పటికీ, ఇంకా దాదాపుగా 20 పేద దేశాలకు టీకా చేరకపోవడం విచారకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా గతం కంటే ఇప్పుడు కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగినట్లు డబ్ల్యూహెచ్ వో తెలిపింది. వీలైనంత త్వరగా పేద దేశాలకి కరోనా టీకా అందజేయాలని తయారీదారులని కోరారు డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధానోమ్. ఒక్కొక్క దేశానికీ కనీసం కోటి కరోనా టీకాలు అందజేయాలని కోరారు. కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకు గురిచేసే అంశమన్న ఆయన కొవిడ్ నిబంధనలను కుదించడమే ఇందుకు కారణంగా చెప్పారు. అంతేకాకుండా ఓవైపు వైరస్ వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ, ప్రజలు జాగ్రత్త చర్యల్ని పట్టించుకోవడం లేదని తెలిపారు.
ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని టెడ్రోస్ చెప్పారు. అంతర్జాతీయ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా పేద, మధ్య తరగతి దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ టీకాలను పేద దేశాలకు ఇవ్వకుండా స్వప్రయోజనాలకు వాడుకొంటున్న ధనిక దేశాల తీరును ఆయన తప్పుబట్టారు. ప్రపంచవ్యాప్తంగా ముప్పు పొంచి ఉన్న వారిని కాపాడటం అందరి బాధ్యత అని అన్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 62,258 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 30,386 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,08,910కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 291 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,240 కు పెరిగింది.