Begin typing your search above and press return to search.
అర్బన్ మావోయిస్టులంటే ఎవరు?
By: Tupaki Desk | 29 Aug 2018 5:02 PM GMTగత ఏడాది డిసెంబర్ 31న పుణెకి సమీపంలోని కోరెగావ్-భీమా గ్రామంలో దళితులు - ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం నాడు దేశవ్యాప్తంగా పలువురిని పుణె పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో విరసం నేత వరవరరావు - ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్ - అరుణ్ ఫెరీరా - ఫరీదాబాద్ లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త - న్యాయవాది సుధా భరద్వాజ్ - ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, అరెస్టైన కార్యకర్తలందరిని సెప్టెంబరు 5 వరకు హౌజ్ అరెస్టులో ఉంచాలని సుప్రీం ఆదేశించింది. అయితే, వారి అరెస్టుల పర్వంతో `అర్బన్ మావోయిస్టులు` అనే పదం ట్రెండింగ్ లో ఉంది. #MeTooUrbanNaxal అంటూ సోషల్ మీడియాలో ఓ క్యాంపెయిన్ నడుస్తోంది. ఈ క్రమంలో అసలు అర్బన్ మావోయిస్ట్ లేదా నక్సలైట్ అంటే ఏమిటి...ఆ పదం ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చింది...అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రముఖ బాలీవుడ్ చిత్ర దర్శకుడు - నిర్మాత - స్క్రీన్ ప్లే రచయిత వివేక్ అగ్నిహోత్రి ‘అర్బన్ నక్సల్’ పేరుతో స్వరాజ్య పత్రికలో 2017 - మే నెలలో ఓ వ్యాసం రాశారు. పట్టణాల్లో ఉండే మేధావులు - ప్రభావశీలురుని అర్బన్ నక్సలైట్లని సంబోధించారు. వారంతా ప్రాముఖ్యత కలిగిన కార్యకర్తలుగా ఉంటూ.... భారత దేశానికి కనిపించని శత్రువులని - రాజ్యానికి వ్యతిరేకంగా విప్లవాన్ని రాజేసేవారని పేర్కొన్నారు. ఆ తర్వాత వారిని‘హాఫ్ మావోయిస్ట్స్’ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ వర్ణించారు. అంతేకాదు, వీరు భారత ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారులుగా పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆ పదం వాడుకలోకి వచ్చింది. దీంతో, ఈ ఏడాది జూన్ లో భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ - ప్రొఫెసర్ షోమా సేన్ - సామాజిక కార్యకర్తలు మహేశ్ రౌత్ - సుధీర్ ధావ్లే - రోనావిల్సన్ లను అరెస్ట్ చేసినప్పుడు వారిని పోలీసులు ‘అర్బన్ మావోయిస్టులు’గా పేర్కొన్నారు. వీరి అరెస్టుల తర్వాత ‘అర్బన్ మావోయిస్టులు’ అనే పదం బహుళ ప్రాచుర్యం పొందింది.