Begin typing your search above and press return to search.
మూడు రాజధానులు..జగన్ వెనుక ఉన్నది ఆయనేనా?
By: Tupaki Desk | 21 Dec 2019 1:23 PM GMTఏపీ రాజకీయం మొత్తం ప్రస్తుతం రాజధాని చుట్టూనే తిరుగుతోంది. ఏ ముహూర్తాన సీఎం జగన్ అసెంబ్లీ లో ఏపీకి మూడు రాజధానులు ఉండచ్చు అని ప్రకటించారో ..అప్పటినుండి ఈ వ్యవహారం రాష్ట్రంలోనే కాదు ..దేశ రాజకీయాలలో కూడా హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజధాని మార్పు పై అనేక చర్చలు జరుగుతున్నాయి కానీ , ఏకంగా ఈ రేంజ్ లో సీఎం జగన్ ట్విస్ట్ ఇస్తారని ఎవ్వరు ఊహించలేకపోయారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుతిరిగే బాబే , సీఎం జగన్ మూడు రాజధానులు ఉండచ్చు అని చెప్పగానే షాక్ కు గురయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు .
అయితే , ఏదేదో ఇప్పటికిప్పుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం కాదు ఇది. సీఎం గా జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజునుండే రాజధాని పై కసరత్తు చేసారని సమాచారం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు-నలుగురికి మాత్రమే ఈ విషయం ప్రకటన కంటే ముందు తెలుసు అని సమాచారం. ముఖ్యంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఓ వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పేరు స్వరూపానంద స్వామి. అమరావతిని చంద్రబాబు రాజధానిగా ప్రకటించినప్పుడు చాలామంది దానికి అభ్యంతరం వ్యక్తంచేశారు. రాజధానిగా అమరావతికి వాస్తు సరిగ్గా లేదని, చివరికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం కూడా వాస్తు విరుద్ధంగా ఉందని అప్పట్లో కొందరు తమ ఆవేదన వ్యక్తంచేశారు. వారిలో ఒకరే స్వరూపానంద స్వామిజి.
అలాగే భౌగోళికంగా కూడా అమరావతిని రాజధానిని చేయడం ఏమంత శ్రేయష్కరం కాదని కొంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్వరూపానందన, జగన్ కు కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. వాటి ఫలితంగానే ఇలా మూడు రాజధానుల ప్రకటన వచ్చిందని కొందరు చర్చించుకుంటున్నారు. జగన్ ఇప్పటికే పలుమార్లు స్వరూపానందను కలిసిన సంగతి తెలిసిందే. కేవలం తన వర్గీయుల కోసం, స్వలాభం కోసం అమరావతిని ఏకపక్షంగా రాజధానిగా ప్రకటించుకున్నారు చంద్రబాబు. హూటాహుటిన అసెంబ్లీ, సెక్రటేరియట్లు నిర్మించారు.
కానీ, వాటి నాణ్యత గురించి అందరికీ తెలిసిందే. అలాగే వాస్తుపరంగా కూడా అసెంబ్లీకి, సచివాలయానికి చాలా మార్పుచేర్పులు చేశారు అప్పటి ముఖ్యమంత్రి. ఆ తరువాత జగన్ కూడా నూతన ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగుపెట్టేముందు వాస్తుమార్పులు చేయించుకున్నారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంతానికి విశాఖపట్నం అన్ని విధాలుగా అనువుగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. దీనితో సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం వెనక ఈ వాస్తు అంశం కూడా ఉండే ఉంటుందని చాలామంది భావిస్తున్నారు.