Begin typing your search above and press return to search.

నాసాకు తోలి మహిళాధిపతి .. ఎవరంటే ? బైడెన్ కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   30 Jan 2021 10:30 AM GMT
నాసాకు తోలి మహిళాధిపతి  .. ఎవరంటే ? బైడెన్ కీలక నిర్ణయం !
X
నాసా ... అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది జూలై 1958 29 న స్థాపించబడింది. అంతరిక్ష ప్రాజెక్టులు మాత్రమే కాకుండా మిలిటరీ అంతరిక్ష విశ్లేషణకు ఈ సంస్థ ద్వారా చేపడుతున్నారు. నాసా ప్రధాన కేంద్రం వాషింగ్టన్ లో ఉంది. ఇదిలా ఉంటే .. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేపట్టిన తర్వాత , ఇప్పటివరకు నాసా అధిపతిగా ఉన్న జిమ్‌ బ్రిండెన్‌స్టైన్‌ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. దీనితో త్వరలో బైడెన్ ప్రభుత్వం నాసా కి త్వరలో అధ్యక్షడిని నియమించనుంది. అయితే , నాసా చరిత్రలో తొలిసారిగా ఈ సారి నాసా కి తదుపరి అధిపతిగా ఓ మహిళ ను నియమించబోతుంది అంటూ సైంటిఫిక్‌ అమెరికన్‌ అనే పత్రిక తెలిపింది.

ఈ వార్త కనుక నిజమైతే 1958లో ఏర్పాటైన తర్వాత తొలిసారి నాసాకు ఒక మహిళాధిపతి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం జిమ్‌ స్థానంలో స్టీవ్‌ జుర్‌ జెక్‌ ను నాసా తాత్కాలిక అధిపతిగా బైడెన్‌ నియమించారు. ఇప్పటికే బైడెన్‌ టీమ్‌లో పనిచేస్తున్న ఎల్లెన్‌ స్టోఫాన్, పామ్ ‌మెల్‌ రాయ్‌ తదితరులు ఈ పదవి రేసులో ఉన్నారు. వీరిలో స్టోఫాన్‌ ప్లానెటరీ జియాలజిస్టు, 2013–16లో నాసా చీఫ్‌ సైంటిస్టుగా పని చేశారు. ఇప్పటికే స్మిత్‌ సోనియన్‌ నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ మ్యూజియంకు పగ్గాలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సాధించారు. మెల్ ‌రాయ్‌ యూఎస్‌ వైమానిక దళంలో, నాసాలో పనిచేశారు. టీటీఓ, యూఎస్ ‌డీఏఆర్ ‌పీఏ సంస్థలకు డిప్యూటీ డైరెక్టర్ ‌గా పనిచేశారు. వీరితోపాటు క్లైమేట్‌ సైంటిస్టు షానన్‌ వాలీ, టెక్నాలజీ అనలిస్టు భవ్యా లాల్, ఆస్ట్రోఫిజిస్ట్‌ జెడిదా ఐలర్‌ పేర్లు సైతం నాసా రేసులో వినిపిస్తున్నాయి.

తన కేబినెట్ ‌లో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించిన బైడెన్‌– హారిస్‌ ప్రభుత్వం ఇదే ధోరణిని నాసాకు కూడా విస్తరించాలని యోచిస్తోంది. నిజానికి నాసాకు ఎప్పుడో మహిళాధిపతిని నియమించాల్సి ఉందన్నారు. నాసా చీఫ్ ‌గా నియమించే అవకాశాలున్న కొందరి పేర్లను తాను అంచనా వేస్తున్నానని, కానీ ఇప్పుడు బహిర్గతం చేయనని ప్రముఖ ఆస్ట్రోఫిజిక్స్‌ ప్రొఫెసర్, నాసా ప్యానెల్స్‌ లో మెంబర్ ‌గా పనిచేసిన జాక్‌ బర్న్స్‌ అన్నారు.