Begin typing your search above and press return to search.
చిన్నమ్మ చరిత్ర ఇది...
By: Tupaki Desk | 12 Dec 2016 2:45 PM GMTఅన్నాడీఎంకే అధినేత జయలలిత మృతి తర్వాత ఆమె వారసత్వాన్ని అందుకునేందుకు ఆమె సన్నిహితురాలు, చిన్నమ్మగా పేరొందిన శశికళ ప్రయత్నిస్తున్నారు. అన్నాడీఏంకే నేతలే కాకుండా... ఆ పార్టీ పుదుచ్చేరి శాఖ కూడా ఆమెకే బాసటగా నిలిచింది. ఈ నేపథ్యంలో శశికళ ఎవరు? తమిళ రాజకీయాల్లో ఆమె పాత్ర ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.
శశికళ జన్మస్థలం తంజావూరు జిల్లా మన్నార్‌కుడి. పాఠశాల విద్య వరకే ఆమె చదువుకున్నారు. అప్పటి తంజావూరు జిల్లా కలెక్టరు చంద్రలేఖ వద్ద ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసే నటరాజన్‌ను వివాహం చేసుకున్నారు. సినిమాలపై ఆసక్తి ఉన్న శశికళ పెద్ద వాళ్లతో పరిచయం కోసం కలెక్టరు చంద్రలేఖ ఇంట్లో ఆయాగా పనిచేసిన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1984లో జయలలిత అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సమయంలో తన ప్రసంగాలను వీడియోగా చిత్రీకరించి కేసెట్లుగా అందించేందుకు ఒక వ్యక్తి కావాలని జయ చంద్రలేఖను కోరడంతో తన వద్ద ఆయాగా పనిచేస్తున్న శశికళను జయకు పరిచయం చేశారు. దీంతో వారిద్దరి పరిచయం కాస్త ధృడమైన బంధంగా మారింది.
1991 ఎన్నికల్లో జయ ముఖ్యమంత్రి కావడంతో శశికళ ఆమెకు నీడలాగా మారారు. అంతేకాకుండా డీఎంకే నుంచి ఇక్కట్లు ఎదురైనప్పుడు శశికళ జయకు ఓదార్పు ఇచ్చారు. అనంతరం షాడో సీఎం పాత్రను పోషించారు. అయితే కలర్ టీవీ కుంభకోణంలో 1996 డిసెంబర్ ఏడోతేదీన అన్నాడీఎంకే అధినేత జయతోపాటు శశికళ అరెస్ట్ అయ్యారు. 30 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌పై ఉన్నారు. మరోవైపు 1989 నుంచి పాతికేళ్ల పాటు ఆమెతో కలిసి వున్న నెచ్చెలి శశికళ కూడా ఆగ్రహం చవిచూడాల్సి వచ్చింది. తనకు తెలియకుండా తన వెనుక ‘చాలా తతంగం’ జరుగుతున్నట్లు అప్పటి గుజరాత ముఖ్యమంత్రి నరేంద్రమోదీ నుంచి అందిన సమాచారం మేరకు ఆమె తీవ్ర ఆగ్రహం చెందారు. 2012లో శశికళను, ఆమె బంధు మిత్రులను తన నివాసమైన పోయెస్ గార్డెన నుంచి గెంటేశారు. పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. అయితే తన తప్పేమీ లేదని చెబుతూ కన్నీటి పర్యంతమైన శశికళ.. అన్నపానీయాలు కూడా సరిగ్గా తీసుకోవడం లేదని తెలియడంతో జయ కరుణించారు. కాగా అనంతరం వారిద్దరి మధ్య మునుపటి సాన్నిహిత్యం పెరిగింది. దీంతో మళ్లీ కీలక కార్యక్రమాల్లో శశికళ జోక్యం చేసుకున్నారు. తాజాగా అమ్మ మరణంతో చిన్నమ్మ పాత్రను శశికళ పోషిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా అమ్మ రాజకీయ వారసత్వాన్ని చేజిక్కించుకున్నారు.
ఇదిలాఉండగా...ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాలని వీకే శశికళను లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, పార్టీ సీనియర్ నేత ఎం తంబిదురై కోరారు. జయలలిత మృతి తర్వాత పార్టీకి నేతృత్వం వహించాలని ఇంతకుముందే సీఎం పన్నీర్ సెల్వం సహా పలువురు నేతలు ఆమెను కోరిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పాలనలో జయకు విలువైన సలహాలు ఇచ్చిన శశికళ పార్టీకి సారథ్యం వహించాలని తంబిదురై ఓ ప్రకటనలో కోరారు. అమ్మ (జయ) కూడా శశికళను గుర్తించారని తెలిపారు. తామంతా శశికళను చిన్నమ్మ అని సంబోధించినప్పుడు జయలలిత అభ్యంతరపెట్టలేదని తంబిదురై గుర్తుచేశారు. అమ్మ మనకు దూరమైన ప్రస్తుత తరుణంలో చిన్నమ్మ (శశికళ)కు మాత్రమే పార్టీకి సారథ్యం వహించగల సామర్థ్యం, అనుభవం ఆమెకున్నాయి అని అన్నారు. 35 ఏళ్లుగా జయతో కలిసి పనిచేసిన శశికళ పలు త్యాగాలు చేశారన్నారు. రాజకీయ కక్ష సాధింపుతోనే చిన్నమ్మకు వ్యతిరేకంగా తప్పుడు కేసుల నమోదుతో ఆమె పలుసార్లు జైలుకెళ్లి వచ్చారని, ఇటువంటి న్యాయపోరాటాల్లో అమ్మకు అండగా నిలిచారన్నారు. ఎన్నికలు, ముఖ్యమైన సందర్భాల్లో తన లాంటి వారు జయలలిత వద్దకు వెళ్లినప్పుడు శశికళతో సంప్రదించి అమలుచేయాలని సూచించేవారని గుర్తుచేశారు. ద్రవిడియన్ ప్రముఖుడు సీఎన్ అన్నాదురై, ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్, జయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులన్నీ శశికళకు మద్దతు ప్రకటించాలని సూచించారు. రాష్ర్టాన్ని రక్షించుకునేందుకు పార్టీకి నాయకత్వం వహించాలని శశికళకు చేతులెత్తి నమస్కరిస్తూ కోరుతున్నానన్నారు