Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఎవ‌రో నాకు తెలీదు...బాలకృష్ణ‌!

By:  Tupaki Desk   |   15 Feb 2018 9:34 AM GMT
ప‌వ‌న్ ఎవ‌రో నాకు తెలీదు...బాలకృష్ణ‌!
X
ఇరు రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌లు....ఆ మాట‌కొస్తే కొంత‌మంది దేశ ప్ర‌జ‌లు.....జ‌న‌సేన అధ్యక్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి వినే ఉంటారు. జ‌న‌సేనాని గానే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోగా, మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు విన‌ని తెలుగు వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఆఖ‌రికి చిన్న పిల్ల‌ల‌ను అడిగినా ప‌వ‌న్ గురించి చెబుతారు. ఇక‌, రికార్డు క‌లెక్ష‌న్ల‌తో బాక్సాఫీస్ కు అనేక హిట్ చిత్రాలను అందించిన ప‌వ‌న్ గురించి టాలీవుడ్ లో ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. అయితే, ఇదే టాలీవుడ్ కు చెందిన ప్రముఖ న‌టుడు ఒక‌రు త‌న‌కు ప‌వ‌న్ అంటే తెలియ‌ద‌ని చెబితే న‌మ్మ‌శ‌క్య‌మా? అది కూడా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ‌....త‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఎవ‌రో తెలియ‌దంటూ షాకింగ్ కామెంట్స్ చేశారంటే అస‌లు న‌మ్మ‌గ‌ల‌మా? అయితే, ప‌వన్ పై బాల‌య్య ఆ ర‌క‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ లో ఓ కార్య‌క్ర‌మం ప్ర‌సార‌మైంది. కారు ఎక్కి వెళ్ల‌బోతోన్న బాల‌య్యను కొంత‌మంది విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న పై విధంగా బ‌దులిచ్చిన‌ట్టు ఆ కార్య‌క్రమంలోని వ్యాఖ్యాత చెప్పారు. అంతేకాదు, బాల‌య్య బాబు మాట్లాడిన వీడియో బైట్ ను కూడా ప్ర‌సారం చేశారు. దాంతోపాటు అనేక విష‌యాల‌ను ఆ కార్య‌క్ర‌మంలో వెల్ల‌డించారు. దీంతో, ఆ వీడియో, వార్త‌...ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా విశాఖప‌ట్నంలోని బీచ్ లో టీ. సుబ్బ‌రామిరెడ్డి ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి బాల‌య్య కూడా హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత కారు ఎక్కి వెళ్ల‌బోతోన్న బాల‌య్య‌ను కొంద‌రు విలేక‌రులు....ప్ర‌త్యేక హోదా, ప‌వ‌న్ గురించి అడిగిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆ వ్యాఖ్యాత చెప్పారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీల త‌ర‌పున ప‌వ‌న్ క‌ల్యాణ్ విస్తృతంగా ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌చారంలో భాగంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు అనేక బ‌హిరంగ స‌భ‌ల్లో ఒకే వేదిక‌ను పంచుకున్నారు. చాలా సంద‌ర్భాల్లో ప‌వ‌న్, చంద్ర‌బాబు లు క‌లిసి భోజ‌నం కూడా చేశారు. ప‌వ‌న్, చంద్ర‌బాబుల ఫొటోలు ప్ర‌ముఖ పేప‌ర్ల‌లో, టీవీ చానెళ్ల‌లో ప‌లుమార్లు ప్ర‌సార‌మ‌య్యాయి కూడా. అటువంటిది ప‌వ‌న్ ఎవ‌రో...బాల‌య్య‌కు తెలీదంటే....న‌మ్మ‌లేమ‌ని ఆ కార్య‌క్ర‌మంలో చెప్పారు. ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ న‌టుడైన బాల‌య్య త‌న‌కు ప‌వ‌న్ ఎవ‌రో తెలియ‌ద‌న‌డం హాస్యాస్పద‌మ‌ని అన్నారు. అయితే, రాబోయే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్...అనంత‌పురం నుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం, కొద్ది రోజుల క్రితం అనంత‌లో ప‌ర్య‌టించి అక్క‌డి స‌మ‌స్య‌ల‌ను కేంద్రానికి తెలియ‌జేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం ...తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అనంత‌పురంలో.... ప‌వ‌న్ త‌న‌కు అడ్డుగా ఉంటాడ‌ని భావించిన బాల‌య్య ఫ్ర‌స్ట్రేష‌న్ లో ఈ ర‌క‌మైన వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని చెప్పారు. గ‌తంలో కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు కూడా....త‌న‌కు ప‌వ‌న్ తెలీద‌ని వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ తెలీదంటూ.....బాల‌య్య అన్న‌ట్లుగా వైర‌ల్ అవుతోన్న వీడియో సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.