Begin typing your search above and press return to search.

మ‌న్నెం నాగేశ్వ‌రావుతో సీబీఐలో మార్పేమీ రాదా?

By:  Tupaki Desk   |   24 Oct 2018 3:30 PM GMT
మ‌న్నెం నాగేశ్వ‌రావుతో సీబీఐలో మార్పేమీ రాదా?
X
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో సంక్షోభం తలెత్తడంతో రాత్రికి రాత్రే కొత్త డైరెక్టర్‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రభుత్వం నియమించింది. అంతర్గత పోరుతో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రధాని మోడీ తప్పించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ - ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాను కొంతకాలం సెలవులో వెళ్లాలని డీవోపీటీ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక‌ డైరెక్టర్‌ గా తెలంగాణకు చెందిన మన్నెం నాగేశ్వరరావు నియమితులయ్యారు. మన్నెం నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక‌ అధిపతిగా నియమిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావు తక్షణమే బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు సీబీఐ అడిషనల్ డైరెక్టర్‌ గా ఉన్న నాగేశ్వరరావు...ఇప్పుడు సీబీఐ తాత్కాలిక‌ డైరెక్టర్‌ గా కేంద్రం ఆదేశాలతో పదవీ బాధ్యతలు అందుకున్నారు. అయితే, ఆయ‌న ముందు అనేక స‌వాళ్లు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నాగేశ్వరరావు స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి(వరంగల్) జిల్లా మండపేట మండలం బోరు నర్సాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఏడాదిన్నరగా సీబీఐలో అడిషనల్ డైరెక్టర్‌ గా కొనసాగుతున్నారు. 1986 బ్యాచ్‌ కు చెందిన నాగేశ్వరరావు.. ఒడిశా కేడర్‌ లో విధులు నిర్వర్తించారు. గతంలో ఒడిశా డీజీగా కూడా పనిచేశారు. తాజాగా త‌న‌కు అవ‌కాశం ద‌క్కిన అవ‌కాశం విష‌యంలోనే ఆయ‌న‌కు స‌వాల్ ఎదురు అవుతోంద‌ని అంటున్నారు. అలోక్ - అస్థానా కేసులు.. ఇప్పుడు మన్నెం నాగేశ్వరరావు ముందు ఉన్న ప్రధాన చాలెంజ్. వాళ్లిద్దర్నీ బలవంతంగా సెల‌వులో పంపినప్పటికీ.. వారికి ఉన్న బలమైన రాజకీయ మద్దతు ఉన్న నేప‌థ్యంలో దాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదంటున్నారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆస్థానాను.. ప్రధానమంత్రి నరేంద్రమోడీనే ఏరు కోరి నియమించుకున్న నేప‌థ్యంలో ఈ ఎపిసోడ్‌ పై ద‌ర్యాప్తు నాగేశ్వరరావు చరిత్ర చూస్తూంటే...మోడీ ఆశలకు తగ్గట్లుగా.. వారికి క్లీన్‌ చిట్ ఇవ్వడం తప్ప మరో మార్గం లేనట్లుగా ఉంది.

చెన్నై సీబీఐకి డైరక్టర్‌ గా పని చేస్తున్నపుడు అవినీతి ఆరోపణల వ‌చ్చాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఆయన చేతుల్లో ఏ ఒక్క కేసూ తేలింది లేదనేది కొంద‌రి వాద‌న ఒడిషా పోలీసు శాఖలో పని చేసినప్పుడు అక్కడ అగ్నిమాపక సిబ్బంది దుస్తుల కోనుగోళ్లను అవకతవకలకు పాల్పడ్డారు. మరో పోలీసు అధికారితో బహిరంగంగా గొడవపడి చరిత్ర సృష్టించారు.