Begin typing your search above and press return to search.

ఎవరీ లీసా? ఆమెకు ఏ విషయం న్యాయం చేయాలి? ప్రపంచ వ్యాప్తంగా ట్వీట్ల మోత

By:  Tupaki Desk   |   6 Oct 2021 4:30 PM GMT
ఎవరీ లీసా? ఆమెకు ఏ విషయం న్యాయం చేయాలి? ప్రపంచ వ్యాప్తంగా ట్వీట్ల మోత
X
తాము అభిమానించే వారికి ఏమైనా జరిగితే సదరు సెలబ్రిటీ ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేరు. ఎవరికైతే నష్టం జరిగిందో.. వారికి అంత బాధ ఉంటుందో లేదో కానీ.. వారి అభిమానులు వ్యక్తం చేసే ఆగ్రహావేశాలు ఒక రేంజ్లో ఉంటాయి. తాజాగా ఒక ర్యాపర్ కు అవమానం జరిగిందని.. తనకు న్యాయం చేయాలంటూ ఆమె అభిమానులు చేపట్టిన ట్వీట్ల హోరు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వెల్లువలా వచ్చి పడుతున్న ట్వీట్లను ఓపక్క డిలీట్ చేస్తుండగా.. మరోవైపు లక్షలాది ట్వీట్లు వచ్చి పడుతున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ యంగ్ ర్యాపర్ ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటి? ఆమెకు ఎలాంటి న్యాయం కావాలి? ఎందుకీ ట్వీట్ల వరద పారుతోంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవటానికి ముందు కాస్తంత పరిచయం అవసరం.

ఆమె పేరు లీసా మనోబల్ అలియాస్ ప్రణ్ ప్రియా మనోబల్. ఆమె వయసు కేవలం 24 ఏళ్లు మాత్రమే. ఇటీవల కాలంలో ర్యాపర్లకు దేశాలతో సంబంధం లేకుండా అభిమానులు పిచ్చి పిచ్చిగా పెరిగిపోయారు. మరీ.. ముఖ్యంగా సౌత్ కొరియా ర్యాపర్లకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అక్కడ బోలెడన్ని పాప్ గ్రూపులు ఉన్నా.. బీటీఎస్.. బ్లాక్ పింక్ లాంటి వాటికి ప్రపంచ వ్యాప్తంగా యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు రచ్చ జరుగుతున్నదంతా ‘బ్లాక్ పింక్’ పాప్ గ్రూప్ కు చెందిన లీసా గురించి.

ఆమె తన పదమూడేళ్ల వయసుకి వైజీ ఎంటర్ టైన్ మెంట్ లేబుల్ లో చేరి.. తర్వాత దక్షిణ కొరియాకు మకాం మార్చింది. 2016 నుంచి బ్లాక్ పింక్ లో సింగర్ గా కొనసాగుతోంది. ఆమెకు విపరీతమైన స్టార్ డమ్ తో పాటు.. వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్.. బ్రాండ్ అంబాసిడర్ ల జాబితా చాలా ఎక్కువ. ఏ యాంగిల్ లో చూసినా ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి ఆమె విషయంలో బ్లాక్ పింక్ కాస్త దూరంగా ఉంచుతోంది. బ్లాక్ పింక్ కు చెందిన వైజీ ఎంటర్ టైన్ మెంట్ పక్షపాతంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్న నలుగురు సింగర్స్ తో పోలిస్తే.. లీసాను మాత్రం అనుమతించటం లేదు. దీంతో లీసా అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. వైజీ ఎంటర్ టైన్ మెంట్ మాత్రం ఆమెను కరోనా నిబంధనల కారణంగానే అనుమతించటం లేదని వివరణ ఇస్తున్నా.. ఫ్యాన్స్ మాత్రం ససేమిరా అంటున్నారు. కావాలనే ఆమెను పక్కన పెడుతున్నారని మండిపడుతున్నారు. దీంతో.. ఆమె అభిమానులు #justiceforlisa, #YGLetLisaDoHerWork హ్యాష్ ట్యాగ్ లతో ట్విట్లు చేస్తున్నారు.అంతేకాదు పారిస్ ఫ్యాషన్ వీక్ లో ఛాన్సు ఇవ్వకపోవటాన్ని ఆమెకు జరిగిన అవమానంగా ఆమె అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు.

మిగిలిన ముగ్గురు సింగర్స్ కు లేని రూల్స్ అన్ని లీసాకే ఎందుకు పెడుతున్నారంటూ తమ ఆగ్రహాన్ని.. నిరసనను ట్వీట్లతో చూపిస్తున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా తాజాగా వర్ణ వివక్ష కారణంగానే ఆమెను దూరంగా పెడుతున్నారన్న ఆరోపణ మొదలైంది. దీంతో.. ఇష్యూ మరింత రాజుకుంది. దీనంతటికి కారణమైన వైజీ ఎంటర్ టైన్ మెంట్ చేస్తుందంటూ దానిపై మండిపడటమే కాదు.. దాని సీఈవో మీద RIP పోస్టులు పెడుతున్నారు. అంతకంతకూ పెరిగిపోతున్న నెగిటివ్ ట్వీట్లను డిలీట్ చేయిస్తున్న వీజీ ఎంటర్ టైన్ మెంట్ కు మరింత చుక్కలు చూపించేందుకు లీసా అభిమానులు నడుం బిగించారు. డిలీట్ చేస్తున్న వాటికి ప్రతిగా భారీ ఎత్తున న్యాయం చేయాలంటూ ట్వీట్లు చేస్తుండటంతో ఇప్పుడీ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కేవలం మ్యూజిక్ కేటగిరిలోనే లీసాకు అనుకూలంగా 15లక్షల ట్వీట్లు రాగా.. మొత్తంగా 40 లక్షల ట్వీట్లు లీసాకు మద్దతుగా ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది.