Begin typing your search above and press return to search.

ఎవరు ఈ దిశ ర‌వి ? అసలేంజరిగింది ?

By:  Tupaki Desk   |   15 Feb 2021 10:10 AM GMT
ఎవరు ఈ దిశ ర‌వి ? అసలేంజరిగింది ?
X
పర్యావరణ ఉద్యమకారణి గ్రేటా థన్ ‌బర్గ్ టూల్‌ కిట్ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన కార్యకర్త దిశ రవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం దిశ రవిని కోర్టు ముందు హాజరుపరచగా ఆమెకు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. అయితే, ఆ సమయంలో దిశ రవి తరఫున లాయర్ ఎవరూ హాజరుకాలేదు. శనివారం మధ్యాహ్నం దిశను బెంగళూరులోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసి, ఢిల్లీకి తరలించారు. దిశ రవి న్యాయవాద బృందం మాట్లాడుతూ ఆమెను ఏ కోర్టులో హాజరుపరిచారో న్యాయవాదులకు తెలియదని, కోర్టులో ఆమే సొంతంగా వాదనలు వినిపించిందన్నారు. న్యాయవ్యవస్థ విధులు దిగ్భ్రాంతికి గురిచేసిందని న్యాయవాది రెబక్కా జాన్ ఆరోపించారు.

దిశ రవికి న్యాయ సహకారం అందజేయడంలో ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు న్యాయమూర్తి విఫలమయ్యారని దుయ్యబట్టారు. న్యాయమూర్తి విధులు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఎటువంటి న్యాయ సహయం లేకుండా దిశ రవికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించారు’ అని ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. న్యాయాధికారులు తమ రిమాండ్ విధులను తీవ్రంగా పరిగణించాలి.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ఆదేశాన్ని తప్పనిసరిగా పాటించేలా చూడాలి అని రెబక్కా అన్నారు. విచారణ సమయానికి నిందితుడు తరఫున న్యాయవాది హాజరుకాకపోతే , మెజిస్ట్రేట్ వేచిచూడటం లేదా ప్రత్యామ్నాయంగా న్యాయ సహాయం చేయాలి అని చెప్పారు.

గ్రెటా థన్ ‌బర్గ్ షేర్ టూల్‌ కిట్‌ ను దిశ రవి ఎడిట్ చేసినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆమె పై దేశద్రోహం, కుట్ర కేసు ఆరోపణలు చేశారు. టూల్‌ కిట్‌ ను ఖలిస్థాన్ వేర్పాటువాదులు క్రియేట్ చేశారని, దీనిని సిద్ధం చేయడం, షేర్ చేయడంలో రవి కీలక కుట్రదారుగా ఉందని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. అయితే, తాను ఎటువంటి టూల్‌ కిట్ రూపొదించలేదని, కేవలం రైతులకు మద్దతుగా నిలవడానికే ఫిబ్రవరి 3 రెండు లైన్లను ఎడిట్ చేశానని కోర్టులో దిశ రవి స్పష్టం చేశారు.

అసలు ఎవరు దిశ రవి అంటే .. 22 ఏళ్ల దిశ ర‌వి బెంగ‌ళూరులోని మౌంట్ కామెల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఫ్రైడేస్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్ పేరుతో గ్రెటా థ‌న్ ‌బ‌ర్గ్ ప్రారంభించిన ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌ల గ్రూపులో ఈమె కూడా స‌భ్యురాలు. 2019లో ఫ్రైడేస్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్ ఇండియా విభాగాన్ని ఆమె ప్రారంభించింది. ప‌ర్యావ‌ర‌ణ మార్పుల‌పై ప‌లు ప్ర‌చారాల‌ను ఆమె చేప‌ట్టింది. దిశ నాన‌మ్మ‌, తాత‌లు రైతులు. వాళ్ల వ‌ల్లే అస‌లు ప‌ర్యావ‌ర‌ణ మార్పులు రైతుల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతున్నాయో ఆమె తెలుసుకుంది. సింపుల్ ‌గా చెప్పాలంటే టూల్ కిట్ ఓ సోష‌ల్ మీడియా డాక్యుమెంట్‌. ఇది ఓ స‌మ‌స్య‌తోపాటు దానికోసం చేయాల్సిన ఆచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను వివ‌రిస్తుంది. గ్రెటా థ‌న్‌బ‌ర్గ్ ఈ టూల్‌కిట్‌ను పోస్ట్ చేస్తూ రైతుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపింది.