Begin typing your search above and press return to search.
ఎవరీ ఆకాష్ మధ్వాల్?
By: Tupaki Desk | 25 May 2023 2:44 PM GMTఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ పై ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒక్కరు కూడా అర్థ సెంచరీ చేయకపోయినా ముంబై గెలుపు రుచి చూసింది. ఈ విజయంలో ఆ జట్టు బౌలర్ ఆకాష్ మధ్వాల్ దే ప్రధాన పాత్ర. సంచలన బౌలింగ్ తో రాత్రికి రాత్రే అతడు సూపర్ స్టార్ అయిపోయాడు.
ఆకాష్ మధ్వాల్ కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. తద్వారా టీ-20ల్లో ఒక ఇన్నింగ్స్ లో అతి తక్కువ పరుగులు ఇచ్చి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ఆకాష్ రికార్డులకెక్కాడు. అతడి సంచలన బౌలింగ్ తో లీగ్ మ్యాచుల్లో ముంబైపై గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఎలిమినేటర్ మ్యాచులో మాత్రం ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది.
కాగా తన సంచలన బౌలింగ్ తో ముంబైకి విజయం కట్టబెట్టిన ఆకాష్ మధ్వాల్ గురించే ఇప్పుడు చర్చంతా సాగుతోంది. రూ.20 లక్షల కనీస ధరకు మాత్రమే ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసింది.
కేవలం ఎలిమినేటర్ మ్యాచులోనే కాకుండా లీగ్ దశలోనూ ప్లేఆఫ్ కు చేరాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లోనూ ఆకాష్ మధ్వాల్ నాలుగు వికెట్లతో దుమ్ము లేపేశాడు.
మొత్తంగా ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఏడు మ్యాచ్‌లాడిన ఆకాష్ మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. ఆ జట్టుకు యార్కర్ల కింగ్ బుమ్రా లేని లోటును తీరుస్తూ అత్యంత నమ్మకమైన బౌలర్‌గా ఎదిగాడు.
కాగా ఆకాష్ 1993 నవంబర్ 23న ఉత్తరాఖండ్ లోని రూర్కీలోని జన్మించాడు. ఇంజనీరింగ్ చదివిన అతడు అవతార్ సింగ్ అనే కోచ్ దగ్గర క్రికెట్ కు శిక్షణ పొందారు. 2019–20 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ కోసం.. ఆకాష్ ఉత్తరాఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో 2019 డిసెంబర్ 25న తొలి రంజీ మ్యాచ్ ఆడాడు.
తనకు 24 ఏళ్ల వయసు వచ్చే వరకూ టెన్నిస్ బాల్ తోనే ఆకాష్ క్రికెట్ ఆడాడు. అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి టీమిండియా మాజీ ఓపెనర్, రంజీల్లో అత్యధిక సెంచరీలు చేసిన వసీం జాఫర్ కారణం. 2019లో ఉత్తరాఖండ్ తరఫున ఆడుతున్న సమయంలో ఆకాష్ మధ్వాల్ ప్రతిభను జాఫరే గుర్తించాడని తెలుస్తోంది. ఈ క్రమంలో 2022–23 దేశవాళీ సీజన్లో తమ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గానూ ఆకాష్ మధ్వాల్ ఎంపికయ్యాడు.
కాగా రెండేళ్ల క్రితం అంటే.. 2021లోనే ఆకాష్ ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతన్ని వేలంలో కొనుగోలు చేసినప్పటికీ.. ఆ సీజన్లో ఆడే అవకాశం లభించలేదు. దీంతో 2022లో అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ 2023కి ముందు నిర్వహించిన వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసింది.
ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచ్ కు ముంబై ఇండియన్స్ సిద్ధమవుతోంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. ఇప్పటికే అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ముంబైకి ఆకాష్ మధ్వాల్ లాంటి సంచలన బౌలర్ తోడయితే మరోమారు ఆ జట్టు ఫైనల్ కు చేరడంతోపాటు కప్పు కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.