Begin typing your search above and press return to search.
కేసీఆర్ హిట్ లిస్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు?
By: Tupaki Desk | 28 April 2023 12:07 PM GMTబీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పార్టీలో గుబులు రేపుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకూ సిట్టింగుల కే సీట్లు అని భరోసానిచ్చిన కేసీఆర్ ఇప్పుడు పనితీరు బాగాలేని వారికి హెచ్చరికలు పంపడంతో అందరూ డోలాయమానంలో పడిపోయారు. సమావేశం పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేల మధ్య ఇదే అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం.
సీఎం కేసీఆర్ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారు. ఆయన లిస్టులో ఎవరెవరు ఉన్నారు. ఈ సారి టికెట్లు కట్ అయ్యేదెవరికి ? ఏ జిల్లాల్లో ఎంత మంది ఉన్నారు? అందులో మంత్రులు కూడా ఉన్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు బీఆర్ఎస్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ లో 25 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు డౌట్ అంటూ అప్పట్లో బాంబు పేల్చారు. ఇప్పుడు కేసీఆర్ హెచ్చరికలతో ఆ లిస్టులో తమ పేర్లు ఉన్నాయా? అన్న చర్చ సాగుతోంది. దీని గురించే నేతలంతా ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నట్టు సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బీఆర్ఎస్ లో 30-35 మంది ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. వారికి టికెట్ ఇవ్వనన్న వార్నింగ్ తోనే సిట్టింగులకు గుబులు పట్టుకుందని తెలుస్తోంది.
ఆ 35 మంది ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోకపోతే వారికి టికెట్లు కట్ చేస్తామని కేసీఆర్ చెప్పారని.. ఆ విషయం బీఆర్ఎస్ లోని కొందరు పెద్దలకు తెలుసు అని సమాచారం.
ఇక సంక్షేమ పథకాల మంజూరు కోసం వచ్చే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరో తెలుసు అంటూ కేసీఆర్ బాంబు పేల్చారు. కేసీఆర్ వద్ద 35 మంది ఎమ్మెల్యేల నివేదిక ఉందని సమాచారం. ఇదే విషయాన్ని సీఎం గురువారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో స్పష్టం చేసినట్టు పార్టీ లీడర్లు చెబుతున్నారు.
ప్రగతి భవన్ లో ఉండే సన్నిహిత వర్గాల ద్వారా ఆ జాబితాలో తాము ఉన్నామా? లేదా? అనే విషయాన్ని ఆరాతీస్తున్నారు. తమ పట్ల నెగటివ్ రిపోర్ట్ ఉంటే మార్చుకుంటామని వేడుకుంటున్నారు. అలా వేడుకునే వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం.