Begin typing your search above and press return to search.
అలా జరిగితే నిర్లక్ష్యం కిందకు రాదంట
By: Tupaki Desk | 9 Sep 2015 2:47 PM GMTకుడి ఏడమైతే పొరపాటు లేదు. కానీ.. తెలుపు కాస్తా నలుపు అయితే.. ఇబ్బందే? తెల్లపిల్లాడు పుట్టాల్సింది నల్లపిల్లాడు పుట్టటంతో ఆ యమ్మ బిక్కముఖం వేయటమే కాదు.. తనకు జరిగిన అన్యాయం గురించి కోర్టుకెక్కింది. సిబ్బంది నిర్లక్ష్యం అని తేలినా.. నల్లపిల్లాడు పుట్టటాన్ని తప్పు పట్టలేమని.. ఎలాంటి చర్య తీసుకోలేమని చెప్పటంతో.. కడుపున పుట్టిన బిడ్డను చూసుకొని సదరు మహిళ విపరీతమైన వేదన చెందుతోంది. ఇంతకీ.. నలుపు రంగు మరీ అంత ఇబ్బందా? అంటే.. ఆమె వరకు ఇబ్బందే. ఎందుకంటే..
అమెరికాకు చెందిన జెన్నిఫర్ అనే శ్వేతవర్ణం మహిళ ఒహియో నగరానికి చెందింది. ఆమెకు పిల్లలు పుట్టలేదు. వీర్యదాతలు ఇచ్చే కృత్రిమ వీర్యంతో గర్భవతి కావాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఒక శ్వేతజాతి వీర్యాన్ని ఆమె కోరారు. ఇందుకు తగ్గట్లే ఆమెకు వైద్యసేవలు అందించే సంస్థ ఆమెకు శ్వేతజాతి వీర్యాన్ని ఆమె గర్భంలోకి పంపాల్సి ఉంది.
అయితే.. కృత్రిమ వీర్యాన్ని అందించే సంస్థలోని ఉద్యోగి తప్పిదంతో శ్వేతజాతి వ్యక్తికి చెందిన వీర్యం కాస్త.. నల్లజాతీయుడి వీర్యం ఆమెకు ఎక్కించారు. ఇదేమీ తెలీని ఆమె.. ఎంచక్కా తనకొచ్చిన గర్భంతో మురిసిపోయింది. నవమాసాలు మోసి బిడ్డను కంది. కానీ.. తనకు పుట్టిన బిడ్డను చూసిన సదరు మహిళ షాక్ తింది. ఎందుకంటే.. తెల్లటి పిల్లాడు పుడతాడనుకుంటే.. నల్లటి పిల్లాడు పుట్టటంతో ఆమె నోట నుంచి మాట రాని పరిస్థితి. ఈ షాక్ నుంచి తేరుకున్న ఆమె.. తప్పు ఎక్కడ జరిగిందన్న వెతుకులాట మొదలెడితే.. తనకు వీర్యం అందించిన సంస్థలో దొర్లిన నిర్లక్ష్యమని తేలింది.
దీంతో మండిపడిన ఆమె.. కోర్టు గుమ్మంలో అడుపెట్టి తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి.. వైద్య ప్రమాణాల ప్రకారం పుట్టిన శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని.. రంగు తమ పరిధిలోకి రాదని.. అందుకే తప్పు జరిగిందని తాము చెప్పలేమంటూ కేసును కొట్టేసింది. తెల్లటి పిల్లాడు పుడతాడనుకుంటే నల్లటి పిల్లాడు పుట్టిన వైనంతో జెన్నిఫర్.. తాజా కోర్టు తీర్పుతో వేదన చెందుతోందట.