Begin typing your search above and press return to search.
మగాళ్లు కండోమ్ ను అస్సలు వాడడం లేదట.?
By: Tupaki Desk | 23 Sep 2020 4:00 AM GMTదేశంలోని 19 రాష్ట్రాల్లో కండోమ్ ల వాడకం బాగా తగ్గిందని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో షాకింగ్ విషయం బయటపడింది. 2000 సంవత్సరంలో దేశంలో 38శాతం మంది కండోమ్ లు వాడి సురక్షిత శృంగారం చేయగా.. ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఆ సంఖ్య 24శాతానికి పడిపోయిందని సర్వే తేల్చింది. జనాభాను నియంత్రించడానికి ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాలు, బస్టాండ్ లు, ఇతర ప్రాంతాల్లో ఉచితంగా కండోమ్ లు అందించినా.. వీటిని వాడడానికి మాత్రం పురుషులు ఆసక్తి చూపడం లేదని పేర్కొంది.
ప్రధానంగా పురుషులు కండోమ్ వాడకపోవడానికి శృగారంలో సంతృప్తి, భావప్రాప్తిని కండోమ్ లు దూరం చేస్తున్నాయని భావించడమే కారణం. అందుకే తమకు థ్రిల్ ఇవ్వని కండోమ్ కంటే జంటలు గర్భ నిరోధక మాత్రలు, కాపర్ టీ , ఇంజెక్షన్లు, ట్యూబెక్టమీ, వేసేక్టమీ ఇలా ప్రత్యామ్మాయ పద్ధతులను అవలంభిస్తున్నారని సర్వేలో తేలింది. భావప్రాప్తిలో అస్సలు రాజీపడని పురుషులు ఇలా కండోమ్ వాడకాన్ని పూర్తిగా దూరం పెట్టారని తెలుస్తోంది.
ఇది సమాజానికి డేంజర్ బెల్ లాంటిది. కండోమ్ వాడకుండా అరక్షిత శృంగారం చేస్తే ఆ భాగస్వామికి ఎయిడ్స్ లేదా ఏదైనా సుఖ వ్యాధులు ఉంటే పురుషుడికి సోకే ప్రమాదం ఉంటుంది. తద్వారా 10 నిమిషాల సుఖం కోసం చూసుకుంటే నిండు జీవితమే నాశనమైపోతుంది. అందరూ థ్రిల్ , సుఖం కోసం కండోమ్ ను దూరం పెడుతున్నా.. తద్వారా వచ్చే ఎయిడ్స్ లాంటి భయంకర జీవితాన్ని చిదిమేసే వ్యాధులు సోకుతాయని మాత్రం ఆలోచించకపోవడం గమనార్హం. కండోమ్ వాడకపోవడం వల్ల నిర్లక్ష్యమే వారి ప్రాణాలు తీస్తోంది. కండోమ్ ల వాడకం తగ్గడం మళ్లీ దేశంలో ఎయిడ్స్ రోగుల శాతాన్ని పెంచడానికి కారణమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పుడే మేల్కోకుంటే దేశంలో మళ్లీ ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరగడం ఖాయమంటున్నారు. ప్రభుత్వం దీని మీద వెంటనే దృష్టి పెట్టి ఎయిడ్స్, సుఖవ్యాధులు లాంటివి దరిచేరకుండా కండోమ్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. భావప్రాప్తి సుఖం కోసం కండోమ్ వాడకపోతే ఎయిడ్స్ లాంటి ప్రమాదకర వ్యాధులు చుట్టుముట్టి ప్రాణాలు తీస్తాయనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే ఈ ఎయిడ్స్ బారిన పడకుండా ఉంటారు.