Begin typing your search above and press return to search.

కవితకు దారేది?

By:  Tupaki Desk   |   10 March 2023 12:09 PM GMT
కవితకు దారేది?
X
లిక్కర్ స్కాం కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈనెల 13న ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇదివారకు సీబీఐ విచారించిన సమయంలో అధికారులు కవిత ఇంటికే వెళ్లి వివరాలు సేకరించారు. కానీ ఇప్పుడు ఈడీ అధికారులు తమ కార్యాలయానికి రావాలని ఆదేశించడం పలు చర్చలకు దారి తీస్తోంది. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సైతం సీబీఐ కార్యాలయానికి పిలిపించుకుని ఆ తరువాత అరస్టు చేసింది. ఈ తరుణంలో కవితకు కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశాలు రావడంతో ఆ తరువాత ఏం జరుగుతోందననే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 గుర్మార్గమని కవిత ఆరోపిస్తున్నారు. ఒక మహిళను ఇంటి వద్దే విచారించాల్సి ఉండగా ఈ సెక్షన్ ను అడ్డు పెట్టుకొని కార్యాలయానికి రావాలని ఆదేశించడం దారుణమని అంటున్నారు.

ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని సీబీఐ అరెస్టు చేసి చిచారించి ఆ తరువాత రిమాండ్ కు పంపించింది. ఇక రాజకీయ నాయకుల్లో కవిత మాత్రమే మిగిలి ఉండడంతో ఆమెను ఈడీ అధికారులు ఎలా విచారిస్తారు? అన్నఆందోళన వాతావరణం బీఆర్ఎస్ లో నెలకొంది.

అయితే ఇప్పటికే ఈడీ అధికారులు తమకు లభించిన కొన్ని ఆధారాలతో ఆమెకు ఎటువంటి ప్రశ్నలు వేయాలి? అని లిస్ట్ ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా మనీ లాండరింగ్ కోణంలోనే ప్రశ్నలు వేయనున్నట్లు తెలుస్తోంది.

కవితకు సన్నిహితులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్, బోయినపల్లి అభిషేక్, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబులను అరెస్టు చేసిన విచారించిన విషయం తెలిసిందే. వీరిలో చివరగా అరుణ్ రామచంద్రణ్ పిళ్లయ్ సౌత్ గ్రూప్ లో కవిత బినామీగా ఉన్నట్లు ఒప్పుకోవడంతో ఈడీ అధికారులు కవితకు నోటీసులు పంపించినట్లు చర్చించుకుంటున్నారు. ఈ కారణంగానే సమీర్ మహేంద్రులో షేర్ హోల్డర్ గా చేరి క్విక్ బ్యాక్ రూపంల లావాదేవీలు జరిగినట్లు అనుకుంటున్నారు.

సౌత్ గ్రూప్ తరుపున అరెస్టయిన అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ ఈడీ కస్టడీ ఈనెల 13న ముగియనుంది. అటు డిప్యూటీ సీఎంను వారం రోజుల పాటు కస్టడికి తీసుకొని విచారించిన తరువాత స్పెషల్ కోర్టు పర్మిషన్ తీసుకొని ఆయనను అరెస్టు చేసింది.

అయితే కవితను విచారించిన తరువాత వీరందరినీ కలిపి విచారిస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది. ఆ కోణంలోనే రామచంద్రన్ పిళ్లయ్, మనీశ్ సిసోడియాను అదుపులో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే కవితను ఈడీ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందనేది హాట్ టాపిక్ గా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.