Begin typing your search above and press return to search.

'సాకే' సార్ మాట.. అక్క‌డ వినిపించ‌డం లేదా...?

By:  Tupaki Desk   |   5 July 2021 12:30 PM GMT
సాకే సార్ మాట.. అక్క‌డ వినిపించ‌డం లేదా...?
X
రాష్ట్రానికి రాజైనా.. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటేనే విజ‌యం ద‌క్కుతుంది. ఎంత బిజీగా ఉన్నా.. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లను ప‌ల‌క‌రిస్తేనే.. ఓట్లు రాలేది! గ‌తంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఎంతోబిజీగా ఉన్న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టేవారు. ప్ర‌తి సోమ‌వారం.. ఆయ‌న ఫిర్యాదుల మేళా నిర్వ‌హించి.. ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించేవారు. స్వ‌యంగా తాను లేక‌పోయినా.. త‌న మ‌నుషుల ద్వారా క‌థ న‌డిపించారు. దీంతో తిరుగులేని విజ‌యం ఆయ‌నకు సాధ్య‌మైంది.

కానీ, ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న సాకే శైలజానాథ్ మాత్రం ఈ విష‌యంలో త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల్లో బిజీగా ఉంటున్నాన‌ని చెబుతూ.. సాకే.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్న‌ట్టు ఇక్క‌డ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. వాస్త‌వానికి టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2004, 2009 ఎన్నిక‌ల్లో సాకే.. తిరుగులేని విజ‌యం ద‌క్కించుకున్నారు. మంత్రిగా కూడా ఛాన్స్ పొందారు. అయితే.. త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో ఒకింత ఇబ్బంది ప‌డ్డా.. ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్‌గా ఆయ‌న‌కు ఇక్క‌డ పుంజుకునేందుకు అవ‌కాశం ఉంది.

కానీ, సాకే మాత్రం ఎక్కువ స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోనే ఉంటున్నార‌ని.. క‌రోనా స‌మయంలోనూ ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వలేక పోయార‌ని.. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తి.. దూకుడుగా వ్య‌వ‌హరిస్తూ.. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎస్సీ నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకున్నా.. సాకే సైలెంట్‌గా వ్య‌వ‌హరించార‌ని.. ఇక్క‌డి నేత‌లు ఆరోపిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా.. నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోరా ? అనేది వీరి ప్ర‌శ్న‌. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా కాంగ్రెస్ ఇక్క‌డ పుంజుకునే ప‌రిస్థితి లేకుండా పోతుంద‌ని చెబుతున్నారు. ఆయ‌న రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉండి చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేని ప‌రిస్థితి.

నిజానికి కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు ఓడిపోయిన సంద‌ర్భాలు .. గ‌తంలో లేవు. కానీ, విభ‌జ‌న త‌ర్వాత ర‌ఘువీరా రెడ్డి ఓడిపోయార‌ని.. సో.. ఈ అప‌ప్ర‌ద‌ను తొల‌గించేందుకు సాకేకు గొప్ప అవ‌కాశం ఉన్నా.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌క‌పోవడం,, స్థానిక స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌క‌పోవ‌డం.. వంటివి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి సాకే సార్ ఏం చేస్తారో చూడాలి.