Begin typing your search above and press return to search.

వాట్సాప్​ ‘వాలంటైన్స్​’ మెసేజ్​.. నిజమేనా? ఫేకా?

By:  Tupaki Desk   |   3 Feb 2021 8:44 AM GMT
వాట్సాప్​ ‘వాలంటైన్స్​’ మెసేజ్​..  నిజమేనా? ఫేకా?
X
సోషల్​మీడియాలో ఎప్పుడు ఏ విషయం వైరల్​ అవుతుందో? ఎవరూ చెప్పలేరు..! చాలా తప్పుడు లింక్​లు వైరల్​ అవుతూ ఉంటాయి. ఈ లింకులు ఓపెన్​ చేయగానే.. మన ఫోన్​లోకి మాల్​వేర్​ వచ్చి పడుతుంది. లేదంటే మొబైల్​లో ఉన్న డాటా అంతా చోరీ అవుతూ ఉంటుంది. కానీ చాలామందికి ఈ విషయం తెలియక.. లింకులు షేర్​ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఓపెన్​ చేసినప్పుడు ఏమీ రాకపోయానా.. మళ్లీ మళ్లీ ట్రై చేస్తూనే ఉంటారు. పోయేదేముంది డాటానే కదా..! అని వాళ్ల అభిప్రాయం.

కానీ మన వీక్​నెస్​ను ఆసరా తీసుకొని సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు. తాజాగా వాట్సాప్​ లో ఓ మెసేజ్​ వైరల్​ అవుతోంది. అదేమిటంటే..
ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా తాజ్ హోటల్ ఓ ఆఫర్ ప్రకటించిందని ఓ లింక్​ ఓపెన్​ వైరల్​ అవుతుంది. లింక్​ ఓపెన్​ చేశాక.. మీకు ఓ గిఫ్ట్​కార్డు వచ్చిందని.. దీనితో ఏడురోజులపాటు హోటల్​లో ఉండే అవకాశం ఉంటుందని ఆ లింక్​లో ఉంది. నిజానికి ఇప్పటివరకు ఎవరికీ అటువంటి అవకాశం రాలేదు.

అయినప్పటికీ చాలా మంది ఈ లింక్​ను షేర్​ చేస్తున్నారు. ఈ విషయం తాజ్​ హోటల్​ దృష్టికి చేరింది. దీనిపై తాజ్​ హోటల్​ స్పందించింది. ‘వాలంటైన్స్​ డే సందర్భంగా తాజ్​ హోటల్​ ఎటువంటి ఆఫర్లు ప్రకటించలేదు. సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్న మెసేజ్​కు తాజ్​ హోటల్​కు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి ఆ ప్రకటనను చూసి మోసపోకండి’ అని తాజ్​హోటల్​ ఓ ప్రకటన విడుదల చేసింది.