Begin typing your search above and press return to search.
సర్ ప్రైజ్: రేవంత్ రెడ్డి సభలో సూరీడు.. కథేంటి?
By: Tupaki Desk | 17 Feb 2021 4:06 AM GMTసూరీడు.. ఓ సూరీడు.. దివంగత సీఎం వైఎస్ఆర్ వ్యక్తిగత సహాయకుడిగా.. ఆయన వెన్నంటే ఉండే తెల్లటి జుట్టు గల వ్యక్తి నాడు ఎంతో ఫేమస్. వైఎస్ఆర్ కు ఆప్త శిష్యుడిగా మెలిగేవాడు. కానీ వైఎస్ఆర్ చనిపోయాక సూరీడు కూడా మాయమైపోయాడు. ఆయన ఏం చేస్తున్నారో కూడా తెలియదు.
కానీ చాలా రోజుల తర్వాత సూరీడు మళ్లీ కనిపించాడు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నిర్వహించిన సభలో ప్రత్యక్షమై అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. రేవంత్ తో సూరీడు ఫొటో కూడా దిగాడు. దీంతో కాంగ్రెస్ లో చేరి రేవంత్ తో సూరీడు కలిసి పనిచేస్తారా? లేదా వైఎస్ఆర్ మాదిరిగా రేవంత్ వద్ద పనిచేస్తారా? అసలు కథ ఏంటనేది ఆసక్తిగా మారింది.
రేవంత్ రెడ్డి తాజాగా రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభ నిర్వహించారు. ఈ సభలో సూరీడు పాల్గొనడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. వైఎస్ఆర్ మరణించినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉన్న సూరీడు సడెన్ గా రేవంత్ సరసన కనిపించడం ఆసక్తి రేపుతోంది.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి పీసీసీ రేసులో ఉన్నారు. ఆ తర్వాత పాదయాత్ర ప్లాన్ లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం రేసులోనూ ఉంటారు. ఈ క్రమంలోనే సూరీడి చూపు రేవంత్ పై పడిందని అంటున్నారు. కాంగ్రెస్ మాజీ సీఎంతో పరిచయాలున్న నేతలు కావడం.. వాళ్లతో సూరీడుకు పరిచయాలు ఉండడం.. దీంతో తనకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని ఆయన ఇలా వచ్చి ఉండొచ్చని ప్రచారం సాగుతోంది.