Begin typing your search above and press return to search.
జగన్ మేలుకున్నారు .... జనం మూడ్ ఏంటో....?
By: Tupaki Desk | 10 April 2023 7:00 PM GMTరాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉండడమే సులువు. హ్యాపీ కూడా. ఎందుకంటే అక్కడ ఏ బాధ్యత ఉండదు, క్యాడర్ కూడా అధినాయకత్వం నుంచి ఏమీ కోరుకోరు. వారు బుద్ధిగా పనిచేస్తారు. లీడర్స్ కూడా ఆశతో పనిచేస్తారు. ఇలా అన్నీ బాగుంటాయి. ఎపుడైతే పవర్ చేతిలోకి వచ్చిందో అపుడే అసలైన లుకలుకలు బయల్దేరతాయి. అధికారం అన్నది ఎందరికి పంచినా ఇంకా అసంతృప్తి ఉంటేనే ఉంటుంది.
అందరికీ న్యాయం చేయడం కానీ సంతృప్తి పరచడం కానీ ఎవరి వల్లా సాధ్యం అయితే కాదు. అందువల్ల చూసుకుంటే అధికారంలో ఉన్న పార్టీకి ప్రజల అసంతృప్తులు ఒక వైపు ఉంటే నాయకుల బాధలు ఇబ్బందులు వారి వల్ల పార్టీకి ప్రభుత్వానికి వచ్చే చెడ్డ పేరు, వారి అవినీతి కార్యక్రమాల వల్ల వచ్చే జనాగ్రహాలు అంతిమంగా అవి పార్టీకి చేసే చేటు ఇవన్నీ చాలా పెద్ద సమస్యలుగా మారుతాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే రాజకీయాల్లో అధికార పార్టీకి పేరుకు అయిదేళ్ల పాటు అధికారం ఉంటుంది కానీ సజావుగా సాగేది మూడేళ్లు మాత్రమే. ఆ మీదట అసంతృప్తి బయల్దేరుతుంది. అది ఇంటా బయటా ఉంటుంది. దాన్ని చక్కదిద్దుకునే ప్రత్యత్నం మూడవ ఏట నుంచే మొదలెట్టకపోతే చివరాఖరికి వచ్చాక ఎంత చేసినా ఎన్ని రిపేర్లు చేసినా సుఖం ఉండదు,దానికి ఉదాహరణ కర్ణాటకలో బీజేపీ ఈ రోజు పడుతున్న పాట్లు.
అక్కడ బీజేపీ మీద జనాల్లో అసంతృప్తి ఉంది. నాయకుల మీద ఆగ్రహం ఉంది ఎమ్మెల్యేల మీద కోపావేశాలు ఉన్నాయి. దాంతో జనాల మూడ్ మారిపోయింది. కర్నాటకలో అధికారంలోకి వచ్చేది కచ్చితంగా కాంగ్రెస్ అని సర్వేలు చెబుతునాయి. ఇక బీజేపీ పెర్ఫార్మెన్స్ పూర్ గా ఉండబోతోంది అని తెలిసి ఇపుడు మరమ్మతులకు దిగిగా ఏమీ ఫలితం ఉండదని తేలిపోయింది.
ఈ విషయంలో జగన్ కాస్తా జాగ్రత్తగానే ఉన్నారని అంటున్నారు. ఆయన ఏణ్ణర్ధం నుంచే పార్టీని ప్రజలల్లో పెట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఎమ్మెల్యేలను కూడ జనాల వద్దకు పంపించారు. ఇపుడు చూస్తే మా నమ్మకం నువ్వే జగనన్నా అని కూడా చెబుతున్నారు. ఇదంతా బాగుంది. కానీ ఫలితం ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు. వైసీపీ పట్ల జనాగ్రహం తగ్గడానికి ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపించడం మంచి కార్యక్రమమే అంటున్నారు. పనులు చేయకపోయినా తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు తమతో ఉన్నారని తమకు ముఖం చూపిస్తున్నారన్న సంతృప్తి జనాలకు ఉంటుంది.
ఇదిలా ఉండగా గతంలో ఏపీలో కూడా ఇలాంటి అనుభవమే చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం మీదనే ప్రత్యేక దృష్టి పెట్టారు. అమరావతి రాజధాని అభివృద్ధి అంటూ బాబు అయిదేళ్ళ పాటు తలమునకలు అయ్యారు. ఈ క్రమంలో పార్టీ కట్టు తప్పింది. క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల మీద అవినీతి మరకలు వచ్చాయి. ఈ ఆరోపణలు బాబు పట్టించుకోవడంతో తగిన మూల్యం 2019 ఎన్నికల్లో చెల్లించాల్సి వచ్చిందని అంటున్నారు.
అప్పట్లో ఇంటలిజెన్స్ సర్వే నివేదికలు కూడా టీడీపీ ఓడుతుందని తేల్చాయని అంటున్నారు అయితే ఎమ్మెల్యేల పనితీరుని చివరి దాకా మధింపు చేయలేని బిజీలో గడిపిన చంద్రబాబు 2019 ఎన్నికల వేళ మాత్రం జనాల వద్దకు వెళ్ళి నా ముఖం చూసి ఓటేయండి అని ప్రాధేయపడ్డారు. మా వాళ్ళు తప్పు చేసినా నన్నే చూడండని మొరపెట్టుకున్నారు. వంగి వంగి దండాలూ పెట్టారు అయినా జనాలు మాత్రం కఠినమైన తీర్పే ఇచ్చేశారు.
ఇపుడు జగన్ ప్రభుత్వం విషయం తీసుకుంటే ఎమ్మెల్యేల మీద ఇసుక మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే భూ కబ్జాల మీద ఆరోపణలు ఉన్నాయి. ఎ ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా జనాలు మండుతున్నారు. అయితే జగన్ మాత్రం వారిని జనాల వద్దకే పంపిస్తూ వారి కోపాన్ని చల్లార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జగన్ అయితే చాలా ముందుగానే మేలుకున్నారని అంటున్నారు.
మరి జనాలు ఎలా రియాక్ట్ అవుతారు నిజంగా వైసీపీకి మరో చాన్స్ ఇస్తారాన ఎమ్మెల్యేల మీద కోపం తగ్గుతుందా వంటివి తెలియాలంటే మరో ఆరు నెలల పాటు ఆగాలి అని అంటున్నారు. అప్పటికి జనం మూడ్ పూర్తిగా తెలుస్తుంది అని అని అంటున్నారు. ఒకవేళ జనాలు కనుక ఆగ్రహంతో ఇంకా మండుతున్నా ప్రభుత్వ పని తీరు మీద తీవ్రంగా నిరసన పెరిగినా కూడా అప్పటి నుంచి పెద్దగా వైసీపీ అధినాయకత్వం చేసేది కూడా ఏమీ ఉండదనే అంటున్నారు. చూడాలి మరి ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరుగుతుందా వైసీపీకి రెండో చాన్స్ ఉంటుందా అన్నది.