Begin typing your search above and press return to search.

టీడీపీ త‌మ్ముళ్లు ఏం చేస్తే.. బెట‌ర్‌...?

By:  Tupaki Desk   |   20 Feb 2023 9:35 AM GMT
టీడీపీ త‌మ్ముళ్లు ఏం చేస్తే.. బెట‌ర్‌...?
X
ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు టీడీపీ నేత‌లు ఏం చేస్తే బెట‌ర్‌? ఎలా ముందుకు సాగితే బెట‌ర్‌? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా.. త‌మ‌ను పోలీసులు అడ్డుకుంటున్నార‌ని.. త‌మ కార్య‌క్ర‌మాలుఏవీ కూడా ముందుకు సాగ‌నివ్వ‌డం లేద‌ని వారు ప‌దే ప‌దే చెబుతున్నారు. దీనిని ఎవ‌రూ తోసిపుచ్చే ప‌రిస్థితి లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము వైనాట్ 175 అనే మంత్రం ప‌ఠిస్తున్న వైసీపీ ఆమేర‌కు త‌న హ‌వా ప్ర‌ద‌ర్శించే ప‌రిస్థితి ఉంది. సో.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో టీడీపీ నేత‌లు ఏం చేయాలి? అనేది చర్చ‌.

రాజ‌కీయాల్లో ఎవ‌రుఉన్నా.. ఏం చేసినా.. అంతిమంగా అధికార‌మే కీల‌కం. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు దూకుడుగా ఉండ‌క‌పోతే ఏ పార్టీ కూడా అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి లేకుండా పోతుంది. ఇది గ‌మ‌నించే ఎన్నో ప‌థ‌కాలు.. ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు సైతం అమ‌లు చేస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌లు, మంత్రుల‌ను కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు పంపిస్తు న్నారు.

సో.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు నాయ‌కులు వెళ్లి తీరాల్సిందేననే వాద‌న స‌రైందే. టీడీపీ నేత‌ల‌ను గ‌మ‌నిస్తే.. గ‌తంలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో దీనిని తీసుకువెళ్ల‌లేక‌పోయారు.

చంద్ర‌బాబు వ‌స్తే.. పండ‌గ‌, లేకుంటే దండ‌గ అన్న‌ట్టుగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితంగా ఈ కార్య‌క్ర‌మంలో హిట్ అయిం దా? అంటే.. అయింద‌ని.. లేదుగా అంటే లేద‌ని అనేవారు ఉన్నారు. త‌ర్వాత‌.. ఇదేం ఖ‌ర్మ అనే ఫ్లాగ్ షిప్ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

అయితే.. ఇది కూడా అంతేలా త‌యారైంది. చంద్ర‌బాబుకానీ, కీల‌క నేత‌లు కానీ.. వ‌స్తేనే ఈ కార్య‌క్ర‌మం సాగింది. అంతే త‌ప్ప‌.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఈ కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్ర‌య‌త్నం మాత్రం చేయ‌లేక‌పోయారు. దీనికి నేత‌లు చెప్పిన‌, చెబుతున్న కార‌ణాలు పోలీసులు కేసులు పెడుతున్నార‌ని..అ డ్డుకుంటున్నార‌ని. ఓకే దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. మ‌రి గెలిచేదెలా? అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఇప్పుడు గెలుపు కేవ‌లం చంద్ర‌బాబుది కాదు.. పార్టీది కూడా కాదు. నాయ‌కుల‌ది కావాలి. ద‌శాబ్దాలుగా పార్టీలో ఉంటూ.. ప‌ద‌వులు అనుభ‌వించిన నాయ‌కులు ఈ ఎన్నిక‌ల్లో క‌నుక గెలుపుగుర్రం ఎక్క‌క పోతే.. పార్టీ ప‌రిస్థితి ఏంటి? అనేది ఆలోచించుకునే ప‌రిస్థితి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కాబ‌ట్టి.. సామ‌దాన బేధ దండోపాయాల్లో ఏదో ఒక దానిని ఎంచుకుని నాయ‌కులు ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.