Begin typing your search above and press return to search.
కోటం రెడ్డి మీద వైసీపీ యాక్షన్ అదేనట...?
By: Tupaki Desk | 1 Feb 2023 2:25 PM GMTనెల్లూరు రూరల్ జిల్ల వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద వైసీపీని కడిగి పారేశారు. తాను విధేయతగా ఉంటే పార్టీ అవమానించిందని ఆయన ఫైర్ అయ్యారు. అంతే కాదు మీరు టికెట్ ఇచ్చెదేంటి వచ్చే ఎన్నికల్లో నేనే వైసీపీ నుంచి పోటీ చేయదలచుకోలేదు అని చాలా గట్టిగా చెప్పేశారు. ఇది వైసీపీ అధినాయకత్వానికి నిజంగా ఘాటైన కౌటర్ గానే చూడాలి.
తన మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తనను పార్టీలో అడుగడుగునా అమర్యాదకరంగా చూశారని, మంత్రి పదవి లేదు కనీసం చీఫ్ విప్, విప్, జిల్లా ప్రెసిడెంట్ పదవి అయినా తనకు ఇవ్వలేదని ఆయన అంటున్నారు. వైఎస్సార్ కి జగన్ కి తాను వీర విధేయుడిని అని అలాంటి తాను ఇంతలా బయటపడి మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదని అంటున్నారు.
మొత్తానికి చూస్తే శ్రీధర్ రెడ్డి తనంటత తాను బయటపడ్డారు.తాను నటన చేయను అని చెప్పుకున్నారు. పదిహేను నెలలు అధికారం చేతిలో ఉండగానే తాను ప్రభుత్వానికి ఎదురు నిలిచాను అంటే తన నిజాయితీని అర్ధం చేసుకోవాల ని కోరుతున్నారు. ఇలా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయితే చెప్పాల్సింది చెప్పారు. కుండబద్ధలు కొట్టేశారు.
దీని మీద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ నిన్నటిదాకా మా పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. అంటే ఈ రోజున కాదని ఆయన చెప్పేసినట్లుగా భావించాలి. ఇక తన దారి తాను చూసుకుని తెలుగుదేశంతో అన్నీ మాట్లాడుకుని ఇపుడు బయటకు పోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లుగానే ఈ ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు.
శ్రీధర్ రెడ్డికి పార్టీ గౌరవించిందని సజ్జల అన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించామని, అది పదవి కాదా గౌరవం కాదా అని ఆయన ప్రశ్నించారు. అందరికీ మంత్రి పదవులు అయినా ఇతర అవకాశాలు అయినా రావు అని ఆయన అన్నారు. ఆయనకు అసంతృప్తి ఉంటే తాము సర్దిచెప్పామని, కానీ ఆయన ఆలోచనలు వేరేగా ఉన్నాయని తానే టీడీపీ తరఫున 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాను అని చెప్పినట్లుగా ఆడియో లీక్ అయిందని గుర్తు చేశారు.
ఇలా తన దారి తాను చూసుకున్న ఎమ్మెల్యే విషయంలో పార్టీ చర్యలు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేనే లేదని సజ్జల తేల్చేశారు. ఆయన ప్రభుత్వం మీద పార్టీ మీద విమర్శలు చేశారు కానీ తమ వైపు నుంచి ఆయన్ని ఏమీ అనలేదని అన్నారు. ఇక ఆయన రాజకీయ దారి ఆయన చూసుకున్నారు. ఆ క్రమంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నపుడు పార్టీ స్పందించాల్సి ఉంటుందని అన్నారు.
నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కూడా పట్టించుకోవాల్సినది లేదని అన్నారు. ఆనం ఏ పార్టీలో ఉంటూ ఏ పార్టీలోకి వచ్చారు. ఆయన ఆలోచనలు ఏంటి అన్నది అందరికీ తెలుసు అని సజ్జల అంటున్నారు. ఇక అందరూ కూడగట్టుకునే ఆరోపణలు చేస్తున్నారు అని వారి రాజకీయ దారులు వారు వెతుక్కుంటున్నారని సజ్జల అన్నారు. ఈ నేపధ్యంలో పార్టీ పరంగా యాక్షన్ తీసుకోవాల్సినది అయితే ఏమీ లేదని అన్నారు. అంటే యాక్షన్ తీసుకోకపోవడమే వైసీపీ మార్క్ యాక్షన్ అని అంతా అంటున్నారు.
అయితే పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు చేయవచ్చు కానీ అలా చేస్తే వారు మరింతగా ఫ్రీ అయి ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ అధికార పార్టీని ఇరకాటంలో పెడతారు. అలాగని వదిలేసినా తలనొప్పి తప్పదు కానీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు తరహాలోనే ఈ ఇద్దరినీ ట్రీట్మెంట్ ఇవ్వాలని, వారిని అలా పట్టించుకోకుండా వదిలేయాలని వైసీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.