Begin typing your search above and press return to search.
'బండి' తప్పేంటి? లీకేజీపై టీ హైకోర్టు సూటి ప్రశ్న.. తర్వాతేమైందంటే?
By: Tupaki Desk | 6 April 2023 6:30 PM GMTపదోతరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతంలో.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేసిన ఉదంతంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. మంగళవారం అర్థరాత్రి వేళ.. బండి సంజయ్ అత్తారింటికి వెళ్లిన ఆయన్ను.. పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. ఏ నేరం మీద తనను అరెస్టు చేస్తున్నారన్న దానిపై సమాచారం ఇవ్వకపోవటం లాంటివి తెలిసిందే.
కరీంనగర్ నుంచి వరంగల్ తీసుకెళ్లేందుకు 300 కిలోమీటర్లు తిప్పిన వైనం సంచలనంగా మారటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బండి అరెస్టుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విచారణ చేపట్టారు.
హనుమకొండ కోర్టు విధించిన రిమాండ్ రద్దుపై అత్యవసర విచారణ జరపాలంటూ కోర్టును కోరారు. ఈ సందర్భంగా బండి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. బండి అరెస్టు చేసిన తీరు.. అనంతరం పోలీసులు వ్యవహరించిన తీరును వివరించారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ మీద ఉన్న ఆరోపణలు ఏమిటంటూ ప్రభుత్వాన్ని టీహైకోర్టు ప్రశ్నించింది. ప్రశ్నా పత్రం బయటకు వచ్చిన తర్వాత.. వాట్సాప్ లో సర్య్కులేట్ చేశారే తప్పించి పేపర్ లీకేజీలో ఆయన ప్రమేయం ఏముందని ప్రశ్నించారు.
పేపర్ బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతగా దాన్ని ఏ రీతిలో అయినా వాడుకోవచ్చు కదా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పేపర్ లీకేజీ కుట్రలో బండికి భాగస్వామ్యం ఉందని.. ప్రశాంత్.. బండి సంజయ్ ల మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగినట్లుగా పేర్కొన్నారు. తమకు బండి సంజయ్ ఇంకా ఫోన్ ఇవ్వలేదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో బెయిల్ పిటిషన్ ను కోర్టులో వేసుకోవచ్చని పేర్కొంది. అయితే.. ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేశామని.. దానిపై ఈ రోజు తీర్పు వచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ తరఫు న్యాయవాది కోరారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ను తిరస్కరించాలని అభ్యర్థించారు.
దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ.. ఒకవేళ కింది కోర్టులో బెయిల్ రాకుంటే.. హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది. దీంతో.. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు ఏదో ఒక నిర్ణయం వెలువడే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.