Begin typing your search above and press return to search.
ఏమిటీ మహిళా రిజర్వేషన్ బిల్లు? కవిత దీక్ష లెక్కేంటి?
By: Tupaki Desk | 10 March 2023 2:00 PM GMTతెలుగు సినిమాలు చూసే వారికి కొన్ని విషయాలు ఇట్టే అర్థమైపోతాయి. రాజకీయంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వేళ.. వ్యక్తిగత సమస్యను అందరి సమస్యగా మార్చే ప్రయత్నం జరుగుతుంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయం కూడా ఇప్పుడు అలానే తయారు కానుందా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. పాతికేళ్లుగా సా...గుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు మీద గళం విప్పాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడే గుర్తుకు రావటం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె పాత్ర మీద పలు ఆరోపణలు చేస్తూ.. వేరే వారి రిమాండ్ రిపోర్టులో కవిత పాత్ర మీద పలు అంశాల్ని ప్రస్తావించింది ఈడీ. ఇదే సమయంలో.. కవితకు నోటీసులు ఇచ్చి.. తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.
ఈ నోటీసుల అంశం బయటకు రావటానికి రెండు.. మూడు రోజుల ముందే కోల్డ్ స్టోరేజీలో మూలుగుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిన కవిత.. ఇప్పుడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసేందుకు రెఢీ అయ్యారు. ఇంతకీ ఈ బిల్లు చరిత్ర ఏమిటి? దాని అంశం కవితకు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది? లోక్ సభ సభ్యురాలిగా కొనసాగిన కాలంలో ఆమె ఈ బిల్లు మీద చేసిన కసరత్తు ఏమిటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? అన్నది ప్రశ్నగా మారింది.
ముందు మహిళా బిల్లు.. దాని అవశ్యకత.. ఇప్పటివరకు దాని విషయంలో జరిగిందేమిటి? అన్న విషయాల్ని చూస్తే..
- దేశ జనాభాలో సగమైన మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో తయారు చేసిన బిల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు. అయితే.. ఈ బిల్లు కారణంగా దాని ప్రాథమిక లక్ష్యం నెరవేరుతుందా? అంటే సందేహమే. ఎందుకంటే.. ఇప్పటికే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు మహిళలకు సంబంధించి చూస్తే.. పేరుకు వారు చట్టసభల్లో ఉన్నా.. కథ నడిపేంది మాత్రం వారి భర్తలే.
- అయినప్పటికీ.. చట్టసభల్లో వారి ఎంట్రీ మొదలైతే..కాలనుక్రమంలో వారి సొంతంగా వ్యవహరించటం మొదలు పెట్టొచ్చు. అదెలా అన్న దానికి ఇక్కడో చక్కటి ఉదాహరణ చెప్పొచ్చు. స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరిని ఎన్నికల బరిలో నిలిపిన వేళలో.. అంతా తానై వ్యవహరించారు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆమె ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఆయన హవానే నడిచేది. కానీ.. ఒక్కసారి ఆమె కేంద్ర మంత్రి అయ్యాక మొత్తం మారిపోయింది. ఆమెకున్న ప్రతిభను చూసి దగ్గుబాటి సైతం అచ్చెరువు చెందటమే కాదు.. తాను ఇంతకాలం ఆమెను రాజకీయాల్లోకి తీసుకురాకుండా తప్పు చేశానన్న భావనను సన్నిహితుల వద్ద చేస్తుంటారని చెబుతారు. అందరు పురంధేశ్వరి మాదిరి రాణిస్తారని చెప్పలేం. కానీ.. ఆ అవకాశం అనేది మహిళా రిజర్వేషన్ బిల్లు కారణంగా వచ్చే వీలుందన్నది నిజం.
- భారతదేశ చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే ఈ బిల్లు లక్ష్యం. ఈ బిల్లు అమలైతే లోక్ సభలోనూ.. రాష్ట్రాల అసెంబ్లీలోనూ మహిళలకు 33 శాతం టికెట్లను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే.. మొత్తం సంఖ్యలో 33 శాతం మంది మహిళలే నిలుస్తారు. 1993 పంచాయితీలలో మహిళా రిజర్వేషన్లు తెచ్చినప్పటికీ.. ఇదే డిమాండ్ ను లోక్ సభ.. అసెంబ్లీలలోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా.. ఇప్పటివరకు అది చట్టసభ నుంచి బయటకు అడుగు పెట్టింది లేదు.
- 2008 మేలో ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారు. స్టాండింగ్ కమిటీ సిఫార్సులకు సంపించారు. ఆ తర్వాత 2010లో రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదించారు. లోక్ సభకు పంపారు కానీ.. దీన్నిఆమోదించలేదు. 15వ లోక్ సభలోనే ఇది వీగిపోయింది. పలుమార్లు ఈ బిల్లు మీద రాజకీయ పార్టీల మధ్య చర్చ జరిగినా.. ఇందుకు పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోవటంతో.. ఈ బిల్లు అక్కడితో ఆగిపోయింది. యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ సీరియస్ గా ఈ బిల్లు మీద ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది.
- ఇప్పుడు మోడీ హవా నడుస్తోంది. ఆ పార్టీకి పూర్తి మెజార్టీ ఉంది. అయినా ఎందుకు ఈ బిల్లు చట్టసభలోకి రావటం లేదు? ఆమోదం పొందటం లేదంటే.. దీనికో కారణం ఉంది. ఈ బిల్లు చట్టంగా మారితే.. రొటేషన్ పద్దతిలో మహిళలు పోటీ చేసే స్థానాలు మారుతుంటాయి. అలా జరిగితే.. అప్పటికే ఆయా ప్రాంతాల్లో పట్టున్న పురుష నేతల రాజకీయ భవిష్యత్తుకు దెబ్బ పడే అవకాశం ఉండటమే కాదు.. కొత్త కష్టాలు మొదలవుతాయి. ఇప్పటికే నేతలుగా వెలిగిపోతున్న వారిని వదిలేసి.. ఇతర మహిళలు నేతలుగా అవతరిస్తే.. వారి రాజకీయ భవిష్యత్తుకే దెబ్బ పడే వీలుంది. అందుకే.. ఈ బిల్లును ముందుకు సాగనివ్వటం లేదు.
- ప్రతి ఏడాది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా విడుదల చేస్తున్న గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు 2022 ప్రకారం మొత్తం 146 దేశాల్లో భారత్ ర్యాంకు 135 అంటే.. ఇక్కడి వివక్ష ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు.. అది కూడా కీలకమైన చట్టసభల్లో అన్నది కష్టమే.
కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు.. రాజకీయంగా సెంటిమెంట్ ను రగిలించేందుకు ఈ బిల్లు అప్పుడప్పుడు ఒక ఉత్పేరకంగా పని చేస్తోంది. ఈ కారణంతోనే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఈ బిల్లును అస్త్రంగా బయటకు తీశారు. మోడీ సర్కారు మీద ఒత్తిడి పెంచేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు బయటకు రావటం.. ఆ వేళలోనే ఆమె ఈ అంశాన్ని చేపట్టటం గమనార్హం.
మరి.. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా వ్యవహరించిన కవిత.. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద మాట్లాడలేదు? అప్పట్లో ఎందుకు ధర్నా చేయలేదు? ఎందుకు దీక్ష చేయలేదు? ఆ మాటకు వస్తే.. అసలు ఎన్నిసార్లు కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ప్రశ్నలు సంధించారు. దాని గురించి ఆమె ఎన్నిసార్లు చర్చకు ప్రయత్నించారు. ఎంతకాలంగా ఈ అంశం మీద ఆమె గళం విప్పి.. సభలు.. సమావేశాలు.. దీక్షలు చేపట్టారు? అన్నది కూడా ప్రశ్నలే. వాటికి సమాధానం లేకుండా.. ఇప్పుడు దీక్ష చేస్తామంటే సబబుగా ఉంటుందా? అన్నది అసలు ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.