Begin typing your search above and press return to search.

పాత రూ.5 నోటుకు లక్షలు ఇస్తామంటున్నారట!

By:  Tupaki Desk   |   16 Jan 2020 6:37 AM GMT
పాత రూ.5 నోటుకు లక్షలు ఇస్తామంటున్నారట!
X
పాత వస్తువుల్ని సేకరించేవారు కొందరు ఉంటారు. పాత నాణెల్ని.. నోట్లను అపురూపంగా దాచుకుంటారు. కొందరు మాత్రం అందుకు భిన్నంగా తాము సేకరించిన పాత నోట్లను అమ్మకానికి పెడుతుంటారు. ఇప్పుడు అలాంటి నోటుకు సంబంధించి బయటకు వచ్చిన సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కొన్నేళ్ల కిందటి ఐదు రూపాయిల నోటును ఆన్ లైన్ లో వేలానికి పెట్టారు. సదరు ఈ కామర్స్ వెబ్ సైట్లో సదరు ఐదు రూపాయిల నోటు ఏకంగా లక్షల్లో ధర పలుకుతుండటం చూసినోళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఆ ఐదు రూపాయిల నోటు స్పెషల్ ఏమంటే.. చివర మూడు నెంబర్లు 786 ఉండటమే.

ఈబే సంస్థతో పాటు ఇండియన్ ఓల్డ్ కాయన్ తదితర వెబ్ సైట్లలో పాత నాణెలు.. నోట్లకు సంబంధించిన వేలం సాగుతూ ఉంటుంది. అయితే.. ఇలాంటివాటిల్లో కొన్ని మోసపూరిత వెబ్ సైట్లు.. డీల్స్ కూడా ఉండే ప్రమాదం ఉంది. అందువల్ల జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర ఉన్న పాత నోటు లేదంటే నాణెన్ని ఫోటో తీసి.. వెబ్ సైట్ లో వేలం పెడితే.. దానికి అనుగుణంగా ఆసక్తి ఉన్న వారు తమకు నచ్చిన మొత్తాన్ని కోట్ చేస్తారు. పోటీ దారులు ఎక్కువమంది ఉంటే.. పెద్ద ఎత్తున ధర పలుకుతుంది.

1740కు చెందిన ఒక నాణెన్ని ఇదే రీతిలో వేలానికి ఉంచితే అది కాస్తా రూ.3 కోట్లు పలికింది. అంతేకాదు.. 400 ఏళ్ల నాటి పురాతన వెండి నాణెం వేలంలో రూ.3.50 లక్షలు పలికింది. కాకుంటే.. ఈ నాణెం మీద శివుడి బొమ్మ ఉండటం గమనార్హం. మరి.. మీ దగ్గర ఉండే పాత నాణెలు.. నోట్లను ఒకసారి చూసుకోండి. లక్కీ ఛాన్స్ ఏమైనా ఉందేమో?