Begin typing your search above and press return to search.
నాగార్జున సాగర్ లో బీజేపీ పరిస్థితి అదినా?
By: Tupaki Desk | 6 Jan 2021 6:08 AM GMTదుబ్బాక అయిపోయింది.. జీహెచ్ఎంసీ ముగిసిపోయింది. ఇప్పుడు నాగార్జున సాగర్ ముంచుకొస్తోంది. తెలంగాణలో వరుస ఎన్నికలు.. గులాబీ పార్టీకి కలవరపాటును కలిగిస్తుండగా.. కమలదళంలో జోష్ ను నింపుతున్నాయి.కానీ నాగార్జున సాగర్ లో బీజేపీ అంత ఈజీ కాదని.. అక్కడ ట్రెయిన్ రివర్స్ అవుతోందని అంటున్నారు.
ఇటీవల నాగార్జున సాగర్ లో ఒక సర్వే సంస్థ ప్రజల మనోభావాలను తెలుసుకోగా బీజేపీకి షాకింగ్ ఫలితం వచ్చింది. సర్వేలో బీజేపీకి 5-6శాతం మాత్రమే ఓట్లు వచ్చాయట.. అందుకే అలెర్ట్ అయిన బీజేపీ వాళ్లు ఇటీవల ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టారట..
టీఆర్ఎస్-కాంగ్రెస్ లు కలిసిపోయాయని.. మమ్మలను ఓడించడానికి ముందే చేతులు కలిపారని ప్రచారాన్ని హోరెత్తిస్తోందట.. అయితే పోయిన సారి ఎన్నికల్లో బీజేపీకి నాగార్జున సాగర్ లో కేవలం 5శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇప్పుడు సర్వేలో కొంచెం పెంచుకున్నారు.
ఆ సర్వేలో కాంగ్రెస్ కు ఆధిక్యం ఉందని తేలిందట.. టీఆర్ఎస్ కంటే 2శాతం ఓట్లు కాంగ్రెస్ కు ఎక్కువగా వచ్చాయని తేలిందట.. అందుకే నాగార్జున సాగర్ అభ్యర్థి జానారెడ్డి అధిష్టానానికి తాజాగా కీలక సూచన చేశారట.. నా ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ ను డిసైడ్ చేయండని.. ఇప్పుడు వద్దు అని చెప్పాడంట.. ఎందుకంటే.. ఇప్పుడు ఎవరికి టీపీసీసీ ఇస్తే ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ క్రెడిట్ వాళ్లకు పోతుందని.. ఆ క్రెడిట్ అంతా జానారెడ్డికే రావాలని ఇలా ప్లాన్ చేసుకున్నాడట..
ఉదాహరణకు దుబ్బాకలో రఘునందన్ వలన గెలిస్తే ఆ క్రెడిట్ అంతా బండి సంజయ్ కి వెళ్లిందని.. అక్కడ సానుభూతి వలన రఘునందన్ రావు గెలిచాడని.. దాని ఊపు జీహెచ్ఎంసీలో ఓట్లు సాధించిపెట్టిందని విశ్లేషించారట.. బండి సంజయ్ అంటే ఇప్పటికీ గ్రామస్థాయిలో ఎవరికి తెలియదని.. కానీ క్రెడిట్ అంతా బండికి వెళ్లిందని వాదించాడట..
అలాంటిది నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ గెలిస్తే ఆ క్రెడిట్ కొత్త టీపీసీసీ అధ్యక్షుడికి పోతుందని జానారెడ్డి అభ్యంతరం తెలిపాడట.. జగ్గారెడ్డి, జానారెడ్డి లాంటి వాళ్లు ముందే ఈ పరిస్థితి ఊహించి ఇప్పుడు పీసీసీ చీఫ్ ను అనౌన్స్ చేయవద్దని అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం.