Begin typing your search above and press return to search.
పవన్ వారాహి యాత్ర రిజల్ట్ ఏంటి... హిట్టా... ఫట్టా...!
By: Tupaki Desk | 27 Jun 2023 8:00 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వారాహి యాత్ర.. తూర్పుగోదావరి జిల్లాలో పూర్తి చేసుకుంది. ఈ నెల 14న ప్రారంభించిన యాత్ర.. సుమారు.. 12 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా లోనే సాగింది. ఇక, సోమవారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా లోకి వారాహి యాత్ర ప్రవేశించనుంది. ఓకే.. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పటి వరకు తూర్పు లో పూర్తయిన వారాహియాత్ర ఏమేరకు పవన్ కు బూస్ట్ ఇచ్చింది? అనేది ఆసక్తిగా మారింది.
ఎందుకంటే.. ఎవరు ఏ యాత్రలు చేసినా.. ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే. సో.. పవన్ కూడా దీనికి అతీతమేమీ కాదు. ఈ రకంగా చూసుకుంటే.. పవన్ ఏమేర కు సక్సెస్ సాధించారు..? అనేది చూస్తే.. కేవలం ఆయన మాట విరుపులు.. సవాళ్లు.. ప్రతిసవాళకే పరిమితం అయ్యారు. అయితే.. ఇప్పుడు ఎన్నికల ముందు.. కావాల్సింది.. సహజంగా దిశానిర్దేశం. మరీ ముఖ్యంగా జనసేన వంటి పార్టీకి కీలకమైన తూర్పులో ఓటు బ్యాంకు ఉందనే చర్చ ఉంది.
దీనిని పొదివి పట్టుకుని.. గుండుగుత్తగా తనవైపు మళ్లించుకునే ప్రయత్నం చేయాలి. అయితే.. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం వంటివారు విసిరిన విమర్శల బాణానికి.. జనసేన చిక్కుకుందనే ప్రచారం జరు గుతోంది. ఇలాంటి కీలక సమయంలో ముద్రగడ వంటివారు వ్యూహాత్మకంగా చేసిన విమర్శలు... రాసిన లేఖల పై పవన్ మౌనంగా ఉండి ఉంటే.. అసలు కాపుల గురించిన చర్చ జరిగి ఉండేది కాదు. అదేసమయంలో పవన్ తన వ్యూహాలు చెప్పుకొని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది.
ఇటీవల టీడీపీ ఒక మినీ మేనిపెస్టో ను విడుదల చేసింది. దీనిని పార్టీ నాయకులు క్షేత్రస్థాయి లోకి తీసు కువెళ్తున్నారు. ఇలానే పవన్ కూడా.. ఎన్నికల తర్వాత.. తాను ఏం చేయాల ని అనుకుంటున్నారో.. ఇప్పుడు చెప్పి... జనసేన సైనికుల ను ఉత్సాహపరిచి ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని అంటున్నారు. అదేసమయంలో ప్రజల కు ఏంచేయాలని అనుకుంటున్నారో.. దానిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినాబాగుండేదని చెబుతున్నారు.కానీ, వారాహి యాత్ర రోడ్డు పైనే సాగినా.. దారి మళ్లిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.