Begin typing your search above and press return to search.
ఈడీ కేసులే అజిత్ ను ఓకే అనేలా చేశాయా?
By: Tupaki Desk | 23 Nov 2019 12:28 PM GMTప్రపంచంలో ఎవరూ ఏ పని ఊరికే చేయరు. ప్రతి దాని వెనుక ఏదో ఒక కారణం కచ్ఛితంగా ఉంటుంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కీలకభూమిక పోషించిన అజిత్ పవార్ ఎందుకని ప్లేట్ తిప్పాడు? పార్టీలో చీలికకు కారణం ఏమిటి? తన బాబాయ్ ని దెబ్బ తీశాడా? లేక.. బాబాయ్.. అబ్బాయ్ లు కలిసి డబుల్ గేమ్ ఆడుతున్నారా? ఇలా చాలానే సందేహాలు కలుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రియాక్షన్ మాత్రం వేరుగా ఉంది. అజిత్ పవార్ చేసిన పనితో తనకు సంబంధం లేదంటున్నారు. అజిత్ చర్యను ఖండిస్తూ ట్వీట్ చేస్తున్నారు. దీనికి తోడు శరద్ పవార్ కు తెలీకుండా అజిత్ పవార్ కథ నడిపినట్లుగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు.
ఇంతకీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం అజిత్ ఎందుకు సాయం చేశారన్న విషయంలోకి వెళితే.. పలు వాదనలు వినిపిస్తున్నాయి. అతడిపైన ఉన్న ఈడీ కేసులే మహా ట్విస్టుకు కారణంగా చెబుతున్నారు. వ్యవసాయ మంత్రిగా ఉన్న వేళలో రూ.70వేల కోట్ల మేర స్కాంకు పాల్పడినట్లుగా అజిత్ పవార్ మీద ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఈడీ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఇవే కాక పలు కుంభకోణాల్లో ఆయనకు హస్తమున్నట్లుగా విమర్శలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలోనూ అర్హత లేకున్నా అడ్డమైన డాక్యుమెంట్ల ఆధారంగా వేలాది కోట్ల రూపాయిల్ని పలు షుగర్ ఫ్యాక్టరీలకు నూలు మిల్లులకు రుణాలు ఇప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో బాంబే హైకోర్టు అజిత్ పవార్ సహా ఎన్సీపీ నేత పాటిల్ తో పాటు మరో 70 మంది మీద ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి కేసుల ఉచ్చు నుంచి తప్పించుకోవటం కోసం తానే అధికారానికి కేంద్రంగా మారాలని భావించి.. తాజా నిర్ణయం తీసుకొని ఉంటారన్న వాదన వినిపిస్తోంది.