Begin typing your search above and press return to search.

దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో జగన్ ర్యాంక్ ఎంత?

By:  Tupaki Desk   |   16 Jan 2021 3:26 AM GMT
దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో జగన్ ర్యాంక్ ఎంత?
X
ప్రముఖ జాతీయ వార్తా చానల్ చేసిన సర్వేలో దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేశారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఏబీపీ న్యూస్ చేసిన దేశ్ కా మూడ్ సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రుల్లో మూడో అత్యుత్తమ ముఖ్యమంత్రి ర్యాంకును తన సొంతం చేసుకున్నారు.

మొదటి రెండు స్థానాల్లో మొదటి స్థానం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలువగా.. రెండో స్థానంలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. మూడో స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారు. అత్యుత్తమ పాలనా సామర్థ్యంతో పాటు.. అన్ని వర్గాల ప్రజలకు అసరాగా నిలిచే సంక్షేమ పథకాల్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న సీఎంగా ఏపీ సీఎం నిలిచారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల పని తీరును చూసినప్పుడు.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎనిమిదో స్థానంలో నిలువగా.. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తొమ్మిదో స్థానంలో.. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పదో స్థానంలో నిలిచారు. తాజా సర్వేను దేశ వ్యాప్తంగా 543 ఎంపీ స్థానాల్లో గడిచిన 12 వారాల్లో 30 వేల మంది ప్రజల్ని అడిగిన వివిధ ప్రశ్నల ఆధారంగా ఈ సర్వే రిపోర్టును రూపొందించారు. టాప్ 10 సీఎంల జాబితాను చూస్తే..
1) నవీన్‌ పట్నాయక్‌ – ఒడిశా
2) అరవింద్‌ కేజ్రీవాల్‌ – ఢిల్లీ
3) వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి – ఆంధ్రప్రదేశ్‌
4) పినరయి విజయన్‌ – కేరళ
5) ఉద్ధవ్‌ ఠాక్రే – మహారాష్ట్ర
6) భూపేశ్‌ బఘేల్‌ – ఛత్తీస్‌గఢ్‌
7) మమతా బెనర్జీ – పశ్చిమబెంగాల్‌
8) శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ – మధ్య ప్రదేశ్‌
9) ప్రమోద్‌ సావంత్‌ – గోవా
10) విజయ్‌ రూపానీ – గుజరాత్‌