Begin typing your search above and press return to search.
ఆదాయపన్నులో కొత్త విధానం ఏంటి? పాత విధానం ఏంటి?
By: Tupaki Desk | 2 Feb 2023 10:28 AM GMTమోడీ సర్కారు 2.0లో చివరిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వ్యక్తిగత ఆదాయపన్నుకు సంబంధించిన విధానాన్ని ప్రకటించటం.. విన్నంతనే వావ్ అనిపించేలా మారటం.. ఆ తర్వాత విషయాలు తెలిసిన తర్వాత కాస్తంత నిరాశకు గురైన వైనం తెలిసిందే. అయితే.. ఈ కొత్త ఆదాయపన్ను విధానానికి సంబంధించి.. కొత్త, పాత పద్దతులు ఉంటాయని.. దేన్ని ఎంచుకుంటారన్నది వారి ఇష్టంగా పేర్కొనటం తెలిసిందే.
తాజా బడ్జెట్ ప్రసంగంలో కొత్త విధానంలో ఏడు లక్షల రూపాయిల వార్షిక ఆదాయం మీద ఎలాంటి పన్ను లేదు. అదే సమయంలో ఆదాయపన్ను రూ.7లక్షలు దాటితే మాత్రం ఐదు శ్లాబుల్లో పన్ను ఉంటుందని చెప్పటం తెలిసిందే. ఇప్పుడు చాలామందికి వస్తున్న డౌట్ ఏమంటే.. ఆదాయపన్నుకు సంబంధించిన కొత్త, పాత అనే రెండు ఆప్షన్లు ఉన్నాయా? ఉంటే.. రెండింటిలో దేనితోనైనా అసెస్ మెంట్ చేసుకోవచ్చా? అన్న సందేహం కలుగుతోంది.
అదే సమయంలో పాత, కొత్త విధానాల్లో దేనితో మేలు జరుగుతుందన్నది మరో ప్రశ్నగా మారింది. కొత్త పద్దతిలో రూ.7 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. కొత్త పద్దతితో పోలిస్తే.. పాత విధానమే మేలన్న వాదనను కొందరు ఆడిటర్లు చెబుతున్నారు.
ఎందుకంటే పాత పద్దతిలో అయితే.. స్టాండర్డ్ డిడక్షన్ తో పాటు.. సెక్షన్ 80 సి కింద రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టేవారు.. ఎన్ పీఎస్ కింద రూ.50వేలు పెట్టుబడిపెట్టేవారు.. ఆరోగ్య బీమా ఖర్చుల కింద రూ.25వేలు బీమా తీసుకునేవారు.. పొదుపు కింద రూ.4.25 లక్షలు చూపించే వారందరికి పాత పద్దతే మేలు అని చెబుతున్నారు. దీని వల్ల రూ.6.75 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు.
కొత్త విధానంలో రూ.7లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ కొత్త విధానాన్ని ఎంచుకుంటే రూ.7.2 లక్షల ఆదాయం ఉన్న వారు సైతం భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుందంటున్నారు.
అదే సమయంలో ఏడాదికి రూ.15 లక్షల ఆదాయం పొందే వారు పాత పద్దతిలో రూ.82,500 పన్ను కింద చెల్లించాల్సి వస్తే.. కొత్త విధానంలో అదే ఆదాయానికి దాదాపుగా రూ.1.5లక్షల మొత్తాన్ని పన్నుగా చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. అరకొర ఆదాయం ఉన్న మధ్యతరగతి వారికి కొత్త పద్దతిలో మేలు జరిగితే.. మిగిలిన వారంతా కూడా పాత పద్దతే మేలు అన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.