Begin typing your search above and press return to search.
ఖలిస్థాన్ జెండా ఎలా ఉంటుంది? దాన్నెలా గుర్తు పట్టాలి?
By: Tupaki Desk | 27 Jan 2021 4:47 AM GMTగణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో.. ఖలిస్థాన్ జెండాలు ఎగరటం చాలామందికి కనిపించింది. అయితే.. ఎర్రకోట మీద ఎగురవేసింది ఖలిస్థాన్ జెండా కాదని స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా జరుగుతున్న ప్రచారాన్ని అస్సలు నమ్మాల్సిన అవసరం లేదంటున్నారు. ఇంతకీ ఎందుకీ కన్ఫ్యూజ్ చోటు చేసుకున్నదంటే.. రైతు జెండా.. ఖలిస్థాన్ జెండాలు రెండు పసుపు రంగులోనే ఉండటంతో ఈ కన్ఫ్యూజ్ నెలకొని ఉందంటున్నారు.
ఖలిస్థాన్ జెండా విషయానికి వస్తే.. ఇది త్రికోణాకారంలో ఉండదని.. దీర్ఘ చతురస్త్రాకారంలో ఉంటుంది. దాని మీద ఖలిస్థాన్ అని రాసి ఉంటుంది. అయితే.. రైతులు ఎగురవేసే జెండా కూడా పసుపు రంగుంలో ఉంటుంది. ఈ జెండాపై రెండు ఎద్దులకు కాడి కట్టి రైతు వ్యవసాయం చేస్తున్న దృశ్యం ఉంటుంది. పసుపు రంగును చూసినంతనే.. దీన్ని ఖలిస్థాన్ జెండాగా పొరపాటు పడే ప్రమాదం ఉంది.
ఎర్రకోటపై భారత జాతీయ పతాకానికి పక్కనే ఉండే గుమ్మటానికి మరో రెండు జెండాలు కట్టారు. రెండింటి మీదా నిషాన్ సాహిబ్ మీద ఉన్నట్లే గుర్తులు ఉన్నాయే తప్పించి.. ఖలిస్థాన్ జెండాలు లేవంటున్నారు. అయితే.. నిరసన ప్రదర్శనల్లోనూ.. ఆందోళనలోనూ ఖలిస్థాన్ జెండాలు మాత్రం కనిపించాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రైతు నిరసనల్లో ఘర్షణలు రేపేందుకు పాకిస్థాన్ మిలటరీ నిఘా సంస్థ ఐఎస్ఐ.. బబ్బర్ ఖల్సా సంస్థకు రూ.5కోట్లు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఇటలీలోని ఖలిస్థాన్ మద్దతుదారులకు రూ.2కోట్లు.. కెనడాకు చెందిన ఒక వ్యక్తికి రూ.3కోట్లు పంపినట్లుగా తెలుస్తోంది.