Begin typing your search above and press return to search.
పాలన ఏమో తెలంగాణలో.. యాపారం ఆంధ్రోళ్లతోనా? ఎవరూ అడగరేంది?
By: Tupaki Desk | 12 March 2023 11:00 AM GMTతెలంగాణ వనరుల్ని తినేశారు. తెలంగాణ నీళ్లను కాజేశారు. తెలంగాణ సంపదను దోచేశారు. తెలంగాణను చులకన చేశారు.. ఇలా చెప్పుకుంటూ పోతే గులాబీ బాస్ కేసీఆర్ అండ్ కో చెప్పే మాటల్లో చాలావరకు ఆంధ్రాను చెడుగుడు ఆడుకునేలా ఉంటుంది. అయితే.. ఈ మాటలన్ని కూడా ఏపీలోని ప్రజల్నిఉద్దేశించి మాత్రం కాదంటే కాదని.. కేవలం తెలంగాణను టార్గెట్ చేసుకొని దోచుకునే లీడర్లకు మాత్రమే తమ తిట్లు.. శాపనార్థాలు వర్తిస్తాయని చెబుతారు. సర్లే.. అంత పెద్దమనిషి అబద్ధం చెబుతారా? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరిపెట్టుకోవటం తెలిసిందే.
అందుకే.. కేసీఆర్ పుట్టినరోజైనా.. ఆయన కుటుంబం తిరుపతికి వస్తున్నా.. ఫ్లెక్సీలు.. బ్యానర్లు పెట్టి హడావుడి చేయటమే కాదు.. ఆయన మీద తమకున్న ప్రేమాభిమానాల్ని ప్రదర్శించేసుకోవటం చేస్తుంటారు. అయినప్పటికీ.. ఆయన నోటి ధాటికి నాలుగు తిట్లు ఆంధ్రోళ్ల (అదేనండి ఆంధ్రాకు చెందిన కొందరు నేతలు మాత్రమే)కు పడుతుంటాయి. అయినా.. ఫర్లేదని సరిపెట్టుకోవటం అలవాటుగా మారింది.
కడుపు మండినప్పుడు కేసీఆర్ ఏముంది.. ఇంకెవరైనా ఈ మాత్రం తిట్టకుండా ఉంటారా? అని అనుకొని.. తప్పులు చేసిన నేతల్ని ఆ మాత్రం కడిగేయకపోతే ఏం బాగుంటుందని అనుకున్నారు. ఎప్పుడైతే కరోనా మహమ్మారి వచ్చి పడిందో.. ఆ అత్యవసర వేళలో.. తెలంగాణలో వైద్యం చేయించుకోవటానికి వీలుగా అంబులెన్సులు కట్టించుకొని బయలుదేరారు ఆంధ్రాకు చెందిన పలువురు పేషెంట్లు. వారి ఆశ అంతా.. తమ నేతల మీద కోపం తప్పించి.. తామంటే ప్రేమ ఉండే కేసీఆర్ సారు తమను గుండెల్లో పెట్టుకుంటారనుకున్న వారి ఆశలకు చెక్ పెడుతూ.. తెలంగాణ సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద గస్తీని ఏర్పాటు చేసిన వైనంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు.
చివరకు ఇదెక్కడి విడ్డూరమంటూ హైకోర్టును ఆశ్రయిస్తే.. న్యాయస్థానం సూచనలతో కానీ అంబులెన్సుల్నివదలని పరిస్థితి. అప్పటివరకు ఏపీ ప్రజల మీద తనకు కోపం లేదని.. ఏపీ నేతల మీదనే అనే కేసీఆర్ మాటలకు కొత్త అర్థాల్ని వెతుక్కునే పరిస్థితి. అయినా సర్దుకొని.. పాత విషయాల్ని ఎక్కువ కాలం మనసులో ఉంచుకోకుండా.. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళలో.. గులాబీ బాస్ మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తూ.. ఓట్లు వేయటంతో..పరాభవానికి గురి కావాల్సిన కేసీఆర్ అండ్ కో ఆ ముప్పు నుంచి తప్పించుకుంది.
అయినప్పటికీ.. కేసీఆర్ సారుకు ఆంధ్రోళ్లంటే కోపమే కోపం. తనకు అవకాశం వచ్చిన ప్రతిసారీ ఉమ్మడి రాష్ట్రంలో ఏమేం జరిగిందో చెబుతూ.. తన నోటికి పని చెబుతుంటారు. అయినా.. ఇవేవీ పట్టించుకోకుండా తమ విధేయతను చాటి చెప్పేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా వ్యవహరించే ఏపీ ప్రజలను కాసేపు పక్కన పెట్టేద్దాం. ఏపీ ప్రజలతో తమకు పంచాయితీ లేదని ఉన్నదంతా.. తెలంగాణను దోచుకునే ఏపీ నేతలతోనే అనే గులాబీ బాస్ మాటల్నే పరిగణలోకి తీసుకుందాం. అలాంటప్పుడు కరోనా వేళలో.. ఏపీకి చెందిన నేతలు అనారోగ్యంతో హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరి వైద్యం తీసుకుంటే కిమ్మనకుండా ఉన్న కేసీఆర్ సర్కారు.. సామాన్యులు అంబులెన్సుల్లో వచ్చే వేళలో అడ్డుకోవటం దేనికి నిదర్శనం? అన్నది అసలు ప్రశ్న.
అయిపోయిన పెళ్లికి మేళలు ఎందుకు? అని మాట్లాడొచ్చు. అదే నిజమని నమ్ముదాం. తాజాగా నడుస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. రిమాండ్ రిపోర్టులను చూస్తే.. కవిత తప్పు చేసినట్లుగా కనిపిస్తోంది. అదంతా కూడా రాజకీయ కుట్రే అనుకుందాం. దాన్ని వదిలేద్దాం. ఆమె తప్పు చేసింది లేనిది ఎప్పటికో అప్పటికి తేలేదే. కాకుంటే.. ఇక్కడ చూడాల్సిన పాయింట్ మరొకటి ఉంది. నిద్ర లేచింది మొదలు కేసీఆర్ కుటుంబం ఆంద్రోళ్ల మీద అన్నేసి మాటలు అనేటప్పుడు.. ఆయన కుటుంబంలో కీలకమైన కవిత.. తాను చేసే వ్యాపారానికి సంబంధించిన భాగస్వామ్యులుగా ఆంధ్రోళ్లను ఎంపిక చేసుకోవటం ఏమిటి?
ఇదే లిక్కర్ సిండికేట్ (ఈ పదం కాస్త నాటుగా ఉండొచ్చు) తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యాపారులతో చేయొచ్చు కదా? ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత భాగస్వామ్యులుగా పేర్కొన్న వారంతా ఏపీకి చెందిన వారు కావటం ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ లో ఆమెకు సహకారం అందించిన వారిలో అత్యధికులు తెలంగాణేతరులు కావటం చూసినప్పుడు మాత్రం.. రాజకీయానికి అవసరమయ్యే తెలంగాణ ప్రజలు.. తాము చేసే వ్యాపారాలకు పనికి రాదన్న మాట మనసుకు ఏ మూలన వినిపించినా అర్థం ఉందనుకోవాలా? అనవసరం అనుకోవాలా?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.