Begin typing your search above and press return to search.

కోవిడ్ టీకాతో సీరియస్ రియాక్షన్ అవకాశం ఎంత?

By:  Tupaki Desk   |   16 Jan 2021 5:31 AM GMT
కోవిడ్ టీకాతో సీరియస్ రియాక్షన్ అవకాశం ఎంత?
X
మొన్నటి వరకు అక్కడ అలా.. ఇక్కడ ఇలా అంటూ కరోనాకు సంబంధించిన బోలెడన్ని వార్తల్ని చూశాం. ప్రపంచానికి నిద్ర లేకుండా చేసిన మహమ్మారి అంతు చూసేందుకు వచ్చిన టీకా ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చేసింది. అన్ని రకాల పరీక్షలు.. భద్రతతో పాటు అధికారిక ప్రక్రియలు ముగిసిన తర్వాత తెర మీదకు వచ్చిన వ్యాక్సిన్ కు సంబంధించి పలు సందేహాలు చాలామంది ప్రజల్లో ఉన్నాయి.

టీకా కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయినట్లుగా.. తీవ్రమైన అరోగ్యం బారిన పడినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. వేర్వేరు దేశాల్లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం వైరల్ అయినా.. అందుకు అసలు కారణం ఏమిటన్న విషయాలపై మాత్రం వార్తలు సరిగా రాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు టీకాను వేస్తున్న నేపథ్యంలో.. తీవ్ర రియాక్షన్ వచ్చే అవకాశం ఎంతమేర ఉంది? అన్నది ప్రశ్నగా మారింది.

దీనికి వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్ రెడ్డి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ తో సీరియస్ రియాక్షన్ లక్షల్లో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందన్నరు. ఒకట్రెండు రోజులు పారాసిటమాల్ మాత్రలు వేసుకోవటం సహా సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్ కు వైద్యం చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. మొదటి డోస్ కంటే కూడా రెండో డోస్ వేసుకున్న తర్వాతే ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే వీలుందని చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయని.. దీంతో కరోనా వైరస్ సైకిల్ ను బ్రేక్ చేసే వీలుందని చెబుతున్నారు.

టీకా కేంద్రాల వద్ద అవసరమైన వైద్య నిపుణులు అందుబాటులోఉండటంతోపాటు.. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత యాంటీ బాడీలు వృద్ధి చెందటంతో.. ఎలాంటి ఇబ్బందులు ఉండవంటుననారు. పద్దెనిమిదేళ్ల లోపు వారికి వ్యాక్సిన్ వేయటం లేదని.. పాలిచ్చే తల్లులకు.. గతంలోమందులు వాడటం ద్వారా రియాక్షన్లు వచ్చిన వారికి టీకాలు ఇవ్వటం లేదు. అంతేకాదు... రక్తం గడ్డ కట్టని పరిస్థితి ఉంటే వారికి కూడా టీకాలు ఇవ్వరు. టీకా కోసం వచ్చే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని.. ఇతర వివరాల్ని అడిగిన తర్వాతే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు.