Begin typing your search above and press return to search.
రూ.25 కోట్ల దున్న పోతు.. దీని స్పెషల్ ఏంటి? నెల ఆదాయం ఎంత?
By: Tupaki Desk | 13 April 2023 10:21 AM GMTసాధారణంగా సంతలో ఒక దున్నపోతు ఖరీదు ఎంత ఉంటుంది? మహా అయితే రూ.7వేల నుంచి మంచిదైతే 20వేలలోపు ఉంటుంది. అంతకుమించి దున్నపోతులకు పెట్టరు. ఎందుకంటే అవి పాలు ఇవ్వవు. అయితే వ్యవసాయానికి లేదంటే సంతానోత్పత్తికి మాత్రమే వాడుతారు. అయితే మేలు జాతి దున్నపోతులకు మాత్రం తెగ డిమాండ్ ఉంటుంది. అవుతున్న ముఖ్యంగా హర్యానాకు చెందిన ముర్రాజాతి దున్నపోతు 'షెహన్ షా' ముందు లగ్జరీ కార్ల విలువ కూడా దిగదుడుపేనని అంటున్నారు.
హర్యానాలోని పానిపట్ జిల్లా దిడ్వాడి గ్రామానికి చెందిన నరేంద్రసింగ్ అనే రైతు మేలురకం దున్నపోతును పెంచుకుంటున్నాడు. దీని ముద్దు పేరు 'షెహన్ షా'. వయసు పదేళ్లు. పొడువు 15 అడుగులు.. ఎత్తు ఆరు ఆడుగులు ఉంటుంది. చూడడానికి బలంగా.. మన 'బాహుబలి' సినిమాలోని వెర్రెత్తిన దున్నలా కనిపిస్తుంది. దీని ధర ఎంత అనుకుంటున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25 కోట్లు మరీ.. ఎందుకు దీనికి అంత డిమాండ్ అంటే అంత దాని మగతనానికే ఉంది.
మేలు రకం ముర్రాజాతి దున్నపోతుల వీర్యానికి మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. నెలలో నాలుగు సార్లు షెహన్ షా వీర్యాన్ని బయటకు తీస్తారు. ఆ వీర్యంతో దాదాపు 800 డోసులను తయారు చేస్తారు. వీటిని వేరు చేసే ప్రక్రియలో ప్రతి డోసుకు రూ.300 ఖర్చు అవుతుందట.. అనంతరం దీన్ని మార్కెట్ లో విక్రయించి నెలకు రూ.9.60 లక్షలు సంపాదిస్తున్నాడు దీని యజమాని నరేంద్రసింగ్.
అందుకే నెలకు దాదాపు 10 లక్షల ఆదాయం తెచ్చిపెడుతున్న ఈ ముర్రాజాతి దున్నను 'నల్లబంగారం' అంటూ పిలుస్తున్నారు. ఈ కర్నాల్ నగరంలో ఇలాంటి దున్నలను ఎన్నో పెంచుతున్నారు
ఇక ఈ ముర్రాజాతి షెహన్ షా కోసం ప్రత్యేకంగా వసతులు కల్పించాడు రైతు నరేంద్రసింగ్. ఏకంగా దీని కోసం ప్రత్యేక ఈత కొలను కూడా కట్టించాడు. దీనికి మంచి ఆహారం, గడ్డి, ఇతర పౌష్టికాహారం పెడుతున్నాడు. ఈ దున్న వివిధ పోటీల్లోనూ విజేతగా నిలుస్తుంటుంది. ఓ చాంపియన్ షిప్ లో ఏకంగా 30 లక్షలు గెలిచింది. అందుకే ఆ రైతు ఈ దున్నకు సకల సౌకర్యాలు కల్పించి పెంచి పోషిస్తున్నాడు.
ఇలాంటి దున్న ఉంటే చాలు మనకు ఏ జాబ్ అక్కర్లేదు. హాయిగా దీన్ని కాచుకుంటే బతికేయవచ్చని చాలా మంది సోషల్ మీడియాలో దీని ఆదాయం చూసి కామెంట్ చేస్తున్నారు.