Begin typing your search above and press return to search.

ఆర్టికల్ 35A.. ఎందుకింత వివాదం..

By:  Tupaki Desk   |   6 Aug 2018 11:54 AM GMT
ఆర్టికల్ 35A.. ఎందుకింత వివాదం..
X
జమ్మూ అండ్ కశ్మీర్.. భారత్-పాక్ విడిపోయినప్పుడు తటస్థంగా ఉన్న ఈ స్వతంత్ర్య రాజ్యం అనంతరం భారత్ లో విలీనమైపోయింది. 1952 జమ్మూ కశ్మీర్ ప్రధానిగా ఉన్న షేక్ అబ్ధుల్లాతో భారత ప్రధాని నెహ్రూ ఒక ఒప్పందానికి వచ్చాడు. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్ కు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పించారు. భారత పౌరసత్వంతోపాటు జమ్మూకశ్మీర్ పౌరసత్వం వేరు అనేది ఇందులో పొందుపరిచారు. దీనికి కొనసాగింపుగా 1954లో రాష్ట్రపతి ఆర్టికల్ 35Aను ఆమోదించారు.

*ఆర్టికల్ 35Aలో ఏముంటుంది.?

జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి చెందిన స్థానిక ప్రజలకు ప్రత్యేక హక్కులను ఆర్టికల్ 35A కల్పించింది. బయట రాష్ట్రాలకు చెందిన వారు జమ్ము కశ్మీర్ కు వచ్చి భూమి - ఆస్తులు కొనుగోలు చేసి.. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి వీలులేదని చట్టంలో పేర్కొన్నారు. అంతేకాదు.. బయట రాష్ట్రం నుంచి వచ్చే విద్యార్థులకు జమ్మూలో స్కాలర్ షిప్ లు తీసుకోవడానికి అనర్హులని పొందుపరిచారు. మొత్తంగా జమ్ము ప్రజలకే అన్ని హక్కులు అని.. బయట నుంచి వచ్చిన వారికి ఎలాంటి హక్కులు ఉండవని ఆ ఆర్టికల్ సారాంశం. జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి చెందిన శాశ్వత పౌరులకు మాత్రమే ప్రత్యేక హక్కులు - ఫలాలు అందేలా ఈ ఆర్టికల్ తోడ్పడుతుంది. ఇక ఆర్టికల్ 35Aతో పాటు ఆర్టికల్ 375 కూడా జమ్మూ కశ్మీర్ ను ప్రత్యేక హోదాను కట్టబెట్టింది.

* ఆర్టికల్ 35A వివాదం ఏంటి..?

అయితే ఇటీవల ఓ ఎన్జీవో సంస్థ ఆర్టికల్ 35A చట్టవిరుద్ధమని.. ఇది కేవలం ఒప్పందం మాత్రమేనని.. రాజ్యాంగ సవరణ లేదని సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడంతో వివాదం చెలరేగింది. 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే రాజ్యాంగంలో చేర్చారని.. దానికి చట్టబద్దత లేదని ఎన్జీవో సంస్థ వాదిస్తోంది. అది కూడా తాత్కాలిక ఒప్పందం అని చెబుతోంది. ఎన్జీవో సంస్థ వాదన ఇలా ఉంటే.. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం మాత్రం మరో పిటీషన్ దాఖలు చేసింది. కొత్త ప్రొవిజన్ ను రాజ్యాంగంలో పొందుపరిచే అధికారం - ఆదేశాలు ఇచ్చే అవకాశం రాష్ట్రపతికి ఉంటాయని కౌంటర్ దాఖలు చేసింది.

ఇలా జమ్ము కశ్మీర్ లోని ప్రభుత్వ ఫలాలు ఆరాష్ట్రంలోని స్థానికులకే అందడం అన్యాయమని.. బయట నుంచి వచ్చిన వారికి కూడా అమలు చేయాలని ఓ ఎన్టీవో సంస్థ వేసిన పిటీషన్ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. జమ్మూకశ్మీర్ లోనూ అల్లర్లు చెలరేగుతున్నాయి. కేంద్రం రంగంలోకి దిగి దీనికో పరిష్కారం చూపాలని యోచిస్తోంది.