Begin typing your search above and press return to search.
అంతరిక్షంలో చనిపోయాక ఏమవుతాం?
By: Tupaki Desk | 17 Oct 2021 4:51 AM GMTభూమి మీదకు వచ్చేటప్పుడు (జన్మించేటప్పుడు) ఎంత సిత్రంగా ఉంటుందో.. పోయేటప్పుడు అంతకు మించిన ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పటివరకు చెట్టంత మనిషిలా ఉండి.. క్షణకాలంలో మొత్తాన్ని మార్చేసేలా మనిషి శరీరం నిర్జీవమైన వేళ.. అంతులేని శూన్యత చోటు చేసుకోవటమే కాదు.. ఎన్నోజీవిత సత్యాలు కళ్ల ముందుకు వచ్చేస్తుంటాయి. మరణానికి మించిన వేదన మరొకటి ఉండదు. ఈ మరణం ఎందుకు వస్తుందన్న విషయం మీద శాస్త్రీయ సమాచారం కుప్పులు కుప్పలుగా ఉంటుంది. కానీ.. ఏ మనిషి ఎందుకు? ఎలా చనిపోయారన్న దానికి విశ్లేషణ ఉంటుంది కానీ.. ఆ విషయాన్ని ముందే గమనించేటోళ్లు వేళ్ల మీద లెక్క పెట్టుకునేంతగానే కనిపిస్తారు. మరణం గురించి ఎందుకింత? అన్న డౌట్ రావొచ్చు. కానీ.. విషయం తెలిస్తే.. అంతులోని ఆసక్తి వ్యక్తమవుతుంది.
మనిషి భూమి మీద మరణిస్తే ఏం జరుగుతుందో తెలిసిందే. మరి.. అంతరిక్షంలో మరణిస్తే ఏమవుతుంది? అన్నది ప్రశ్న. గతంలో అంతరిక్షం అన్నది నేల మీద నిలచుకొని అంతులేని ఆకాశం.. అందులోని నక్షత్రాల్ని చూస్తూ గడిపేస్తుంటాం. అందివచ్చిన సాంకేతికత పుణ్యమా అని.. చేతిలో కాసులు గలగలాడితే.. అంతరిక్షంలోకి వెళ్లటం అంత క్లిష్టమైన.. కష్టమైన పని అయితే కాదన్న పరిస్థితికి వచ్చేసింది. తాజాగా పెరిగిన అంతరిక్ష యాత్రలు..రానున్న రోజుల్లో ఈ రంగం మరింత డెవలప్ కావటమే కాదు.. అంతరిక్షంలోని వివిధ గ్రహాల మీద నివాసాలు ఏర్పాటు చేసుకోవటానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది కానీ.. అంతరిక్షంలో మరణిస్తే ఏమవుతుందన్న ప్రశ్న రాగానే.. సమాధానం వెంటనే చెప్పలేని పరిస్థితి. తాజాగా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. అదేమంటే..
భేూమి మీద మనిషి మరణించిన తర్వాత మానవ దేహం దశల వారీగా కుళ్లిపోయి.. ఎముకలు మాత్రమే మిగులుతాయి. దీనికి కారణం భూమి మీద ఉన్న వాతావరణం. కానీ అంతరిక్షంలో అందుకు భిన్నమైన వాతావరణం ఉంటుంది. అందుకే.. భూమి మీద మాదిరి కాకుండా.. భిన్నమైన మార్పులకు శరీరం చోటు చేసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై మరణించినప్పుడు తొలుత రక్త ప్రసారం నిలిచిపోయి.. గురుత్వాకర్షణ శక్తి కారణంగా అది ఒక చోటుకు చేరటం మొదలవుతుందన్న విషయం తెలిసిందే. దాన్నే లివోర్ మోర్టిన్ అంటారు.
విశ్వంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. దీనికి కారణం.. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తిలో ఉండే వైరుధ్యాల కారణంగా లివోర్ మోర్టిస్ దశ మీద ప్రభావం చూపటమే. ఒకవేళ గురుత్వాకర్షణ శక్తి లేకుంటే శరీరంలోని రక్తం ఒక చోటుకు పోగుపడదు. అదే సమయంలో మరణించిన వ్యక్తి.. ఆ సమయంలో స్పేస్ సూట్ ధరించి ఉంటే రిగోర్ మోర్టిన్ (కండరాల్లో అపరిమితంగా కాల్షియం పేరుకుపోయి.. అవి బిగుసుకుపోవటం) పరిణామం చోటు చేసుకుంటుంది. భూమిలో ఖననం చేసినప్పుడు దేహాన్ని కుళ్లబెట్టే ప్రక్రియలో సూక్ష్మజీవులు సాయం చేస్తాయి. ఇతర గ్రహాల్లో అలాంటి పరిస్థితి ఉండదు. ఇతర గ్రహాల్లో అలాంటి పరిస్థితి ఉండదు.
బతికి ఉన్నప్పుడు ఎముకలు సైతం సజీవ పదార్థాలే.వాటిల్లో కర్బన్.. అకర్బన్ పదార్థాలు ఉంటాయి. సాధారణ కర్బన పదార్థాలు కుళ్లిపోతే.. అకర్బన్ పదార్థాలు ఆస్థిపంజరాల్లా మిగిలిపోతాయి. విశ్వంలోని గ్రహాల్లో ఉండే తీవ్రమైన ఆమ్లతత్త్వం కారణంగా భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అకర్బన్ పదార్థాలైన ఎముకలు మాయమై.. మ్రదు కణజాలం మాత్రం మిగిలిపోతుంది. మొత్తంగా విశ్వంలో మరణిస్తే.. మనిషి శరీరం పూర్తిస్థాయిలో క్షీణించటం అన్నది ఉండదు. ఈ కారణం చేతనే.. కొత్త తరహా అంత్యక్రియలు అవసరమవుతాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు చెబుతన్నారు.