Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు ఏమైంది? ఇలాంటి సెల్ఫ్ గోల్ ఎప్పుడూ చూడలేదే?
By: Tupaki Desk | 3 March 2023 10:03 AM GMTనాకింకా లాంగ్ ఇన్నింగ్స్ ఉంది. మరో పది.. పదిహేనేళ్లు రాజకీయాల్లో చురుగ్గా ఉండాలనుకుంటున్నా.. అంటూ రాష్ట్ర రాజకీయాలు వదిలేసి.. జాతీయ రాజకీయాల వైపు ఫోకస్ చేసిన బీఆర్ఎస్ అధినేత కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల పవర్ ఏమిటో తెలిసిందే. ఆయన నోరు విప్పి మాట్లాడితే.. ఎంతోడైనా సరే ఫిదా కావాల్సిందే.అలాంటి కేసీఆర్ నోటి నుంచి అనూహ్యంగా వచ్చిన మాటలు.. ఆయనకు కౌంటర్ గా మారటమే కాదు.. సన్నిహితులు సైతం భలే సెల్ఫో గోల్ చేసుకున్నారే? అన్న మాట వినిపిస్తోంది.
తాజాగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తాను ముసలోడ్ని అయినట్లుగా పేర్కొన్నారు. నిజానికి ఆయన ఉద్దేశం వేరే అయినా.. చివరకు ఆయన మాటల అర్థం ఆయన్ను ఇబ్బంది పెట్టేలా మారింది. మంత్రి పోచారం తన వయసు పెద్దదైన కారణంగా.. తాను వెనక్కి తగ్గి తన కొడుకులకు తన రాజకీయ వారసత్వాన్ని అధికారికంగా కట్టబెట్టాలనుకున్న ఆలోచనకు చెక్ పెట్టే క్రమంలో సీఎం కేసీఆర్ వయసు ప్రస్తావన తీసుకొచ్చారు. తాను సైతం ముసలోడ్ని అవుతున్నానని.. అంతమాత్రాన పగ్గాల్ని పిల్లలకు ఇవ్వకుండా.. మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాను కదా? అన్న సందేశాన్ని ఇవ్వాలనుకున్న కేసీఆర్ అందుకు భిన్నంగా బుక్ అయ్యారు.
ఏదో చెబుదామనుకుంటే.. మరేదో చెప్పిన ఉదంతంలో ఆయనకు అనూహ్యంగా దెబ్బ పడింది. తనకు తానే ముసలోడ్ని అయినట్లుగా చెప్పుకునే కేసీఆర్ కు.. జాతీయ రాజకీయాలు ఎందుకు? ఫాంహౌస్ లో పడుకోకుండా? అంటూ పరుష వ్యాఖ్యలతో కూడిన పంచ్ లు పడ్డాయి. పార్టీని భారీ ఎత్తున విస్తరించే ఆలోచనలో ఉన్న కేసీఆర్.. ఇప్పుడు తన సమయాన్ని అధికంగా అందుకే వినియోగిస్తున్న వేళ.. వయసు గురించి కేసీఆర్ నోట వచ్చిన మాటలో ఉన్న తేడా అర్థం ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారింది.
ముఖ్యమంత్రి పదవిని తన కొడుక్కిఅప్పగించే ఆలోచనతోనే కేసీఆర్ నోటి నుంచి ముసలోడి మాట వచ్చిందంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 69 ఏళ్ల కేసీఆర్.. తనకంటే మూడేళ్లు పెద్దవాడైన 72 ఏళ్ల మోడీపై పోరాటం చేయటం తెలిసిందే. అయినప్పటికీ నరేంద్ర మోడీ నోటి నుంచి ఏ రోజున కూడా ఈ తరహాలో వయసు పెద్దదైపోయిందన్న మాట వచ్చింది లేదు. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ తన నోటి నుంచి తానే అన్న మాట ఆయన్ను ఆత్మరక్షణలో పడేలా చేసిందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.