Begin typing your search above and press return to search.

కారెం-జూపూడిల రాజ‌కీయం ఏమైంద‌బ్బా?!

By:  Tupaki Desk   |   24 Feb 2023 12:00 PM GMT
కారెం-జూపూడిల రాజ‌కీయం ఏమైంద‌బ్బా?!
X
రాజ‌కీయాల్లో మూడేళ్ల కింద‌టి వ‌ర‌కు దూకుడుగా ఉన్న నాయ‌కులు.. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వ‌ర్గం త‌ర‌ఫున పోరాటాలు. ఉద్య‌మాలు .. అంటూ నిత్యం మీడియాలో ఉన్న నాయ‌కులు కారెం శివాజీ. జూపూడి ప్ర‌భాక‌ర్‌. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఇద్ద‌రూ కూడా ఆ పార్టీలో ఉన్నారు. త‌ర్వాత‌.. చంద్ర బాబు వారికి ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని కారెంకు ఇచ్చారు. ఇక‌, ఎస్సీ కార్పొరేష‌న్‌లోనే ఫైనాన్స్ క‌మిష‌న్ ప‌ద‌విని సృష్టించి జూపూడికి ఇచ్చారు.

దీంతో ఇద్ద‌రూ కూడా నాలుగున్న‌రేళ్లు టీడీపీ ప్ర‌భుత్వంలో ఉంటూ.. హ‌వా చ‌లాయించారు. రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు.. అధికారుల‌పై పెత్త‌నం కూడా చేశారు. అయితే.. ఇద్ద‌రిలో ఒక్క‌రూ కూడా ఒక్క నియోజ‌క‌వ‌ర్గం లో టీడీపీని గెలిపించుకోలేక పోయారు.

మొత్తం 29 ఎస్సీ ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. కొండ‌పి మిన‌హా.. ఎక్క‌డా టీడీపీ గెల‌వ‌లేక‌పోయింది. ఈ సీటు కూడా వ్య‌క్తిగ‌త హోదాలో డోలా బాల వీరాంజ‌నేయ‌స్వామి విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే..పార్టీ ఓడిపోగానే.. ఈ ఇద్ద‌రు ఎస్సీ సామాజికోద్ధ‌ర‌ణ నాయ‌కులు కూడా వెంట‌నే వైసీపీ పంచ‌న చేరిపోయారు. ప్ర‌స్తుతం ఏవో చిన్న‌చిన్న ప‌ద‌వుల్లో ఉన్నా.. ఎక్క‌డా వారి మాట వినిపించ డం లేదు.

అప్పుడ‌ప్పుడు.. జూపూడి అయినా.. క‌నిపిస్తున్నారు కానీ, కారెం అస‌లు అడ్ర‌స్‌లేకుండా పోయారు. ఇక‌, ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు కూడా ఎస్సీ సామాజిక వ‌ర్గంలోనూ ఎక్క‌డా సానుకూల వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు.

ఏ ఎండ‌కు ఆగొడుగు ప‌డ‌తార‌నే పేరున్న ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఒక‌ప్పుడు ప్ర‌భావం చూపించారేమో.. కానీ, ఇప్పుడు మాత్రం ఆయా సామాజిక వ‌ర్గాల్లోనూ ప్రభావం చూపించలేకపోతున్నారు అని అంటున్నారు . దీంతో కారెం, జూపూడి రాజ‌కీయాలు ఇక‌, స‌మాప్త‌మైన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. నిబ‌ద్ధ‌త‌లేని అడుగులు.. ఏఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే విధానాల్లో త‌ల‌మున‌క‌లైన తీరే.. వీరిని రాజ‌కీయంగా ఎటూ కాకుండా చేసింద‌నే వాద‌న మాత్రం వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.