Begin typing your search above and press return to search.
పొలంలో కి వెళ్లిన పవన్ కు రైతులు ఏం చెప్పారు?
By: Tupaki Desk | 11 May 2023 2:54 PM GMTఅకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతుల ను పరామర్శించేందుకు వీలుగా గోదావరి జిల్లాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు.. రైతుల్ని పరామర్శించే అవకాశం లభించలేదు. అంచనాలకు మించిన జనం పోటెత్తటంతో జనసేనాని కారు కూడా దిగలేని పరిస్థితి. ఇలాంటి వేళ.. కడియం మండలంలోని కడియం ఆవ భూముల్లోకి వెళ్లారు పవన్ కల్యాణ్. అక్కడ పంట నష్టం ఎంత జరిగిందన్న దాని గురించి తెలుసుకునేందుకు వెళ్లారు.
ఆ సందర్భంగా మెలకలు ఎత్తిన ధాన్యాన్ని పరిశీలించిన పవన్.. అక్కడున్న రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదన ను వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలపై ఘాటుగా రియాక్టు అయిన వారు పవన్ కు ఏమేం చెప్పారన్నది చూస్తే..
- రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం రైతుల్ని నిలువు దోపిడీ చేస్తోంది. అకాల వర్షానికి బలై పుట్టెడు దు:ఖంలో ఉంటే కనీసం స్పందించలేదు. మేం కొడతామనే భయంతో వైసీపీ నేతలు పొలంగట్లకు రావట్లేదు.
- రబీలో ఎకరానికి 55 బస్తాలు దిగుబడి వస్తే కేవలం 33 కాటాలే కొంటామని ప్రభుత్వం చెప్పింది. దీంతో మేం తహశీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా చేశాక 48 బస్తాలు కొంటామని ఒప్పుకున్నారు. ఎంత ధాన్యం పండితే అంతా కొనాలి కానీ వాళ్ల కు ఇష్టం వచ్చినట్లుగా కొంతే కొంటామని ఎలా అంటారు?
- కష్టపడి పండిస్తున్నాం.ఇవేమైనా నూతిలో నీళ్ళా తోడుకొచ్చి పారేయడానికి? ముందుగా కొనేసి ఉంటే ఇప్పుడీ సమస్య ఉండేది కాదు.
- ఎక్కడ ధాన్యం అక్కడ మిల్లుల కు చేరకుండా సుమారు 30 నుంచి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న మిల్లులు కేటాయించారు. కడియం ధాన్యాన్ని అనపర్తికి, అనపర్తి ధాన్యాన్ని కోరుకొండ మిల్లు కు కేటాయించారు. రకరకాల కారణాలతో కొంతమంది రైతుల నుంచి రూ.40వేల వరకూ కట్టించుకున్నారు.
- అప్పులు చేసి కట్టాం. వెయిటింగ్ చార్జీలు కూడా వసూలు చేశారు. గతంతో బ్రోకర్లు వచ్చి ధాన్యం కొన్న వెంటనే డబ్బు ఇచ్చేసేవారు. ఈ బాధలు ఉండేవి కావు. ఇవాళ ధాన్యం ఎప్పుడు కొంటారో తెలీ దు. ఎప్పుడు డబ్బులు ఇస్తారో తెలీదు.
- ఇప్పటికే మూడు వంతుల ధాన్యం కొనేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ.. ధాన్యం రైతుల వద్దే ఉంది.