Begin typing your search above and press return to search.
మీడియాతో ఏపీ డీజీపీ చెప్పిందేమిటి? మీడియాకు ఇచ్చిన నోట్ లో ఉన్నదేంటి?
By: Tupaki Desk | 16 Jan 2021 3:16 AM GMTఒకటి కాదు రెండు కాదు.. పదే పదే తప్పులు దొర్లటం ఏమిటి? ఈ ప్రశ్నను సంధించాల్సిన పిరిస్థితి ఏపీ డీజీపీని ఉద్దేశించి. ఎందుకంటే.. మీడియాలో వచ్చిన తాజా కథనాలు చూస్తే.. అవాక్కు కావటం ఖాయం. మీడియా సమావేశంలో తాను చెప్పిన మాటల్లో తేడా రావటం ఒక ఎత్తు అయితే.. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా భేటీలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలకు.. ఆయన ఇచ్చిన మీడియా నోట్ కు పోలిక లేకపోవటం గమనార్ధం.
దేవతామూర్తుల ధ్వంసం కేసులో రాజకీయ కోణం ఉందన్న ఆయన మాటే ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే.. రెండు రోజుల క్రితం అలాంటిదేమీ లేదన్న ఆయన.. రెండు రోజులు తిరిగేసరికి.. రాజకీయ పార్టీల కోణాన్ని ఆయన వెలికి తీశారు. ‘‘రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల పాత్ర ఉంది. 9 కేసుల్లో వారి పాత్రపై ఆధారాలు సేకరించాం. అందులో 15 మందిని అరెస్టు చేశాం. వీరిలో 13 మంది ఒక పార్టీకి, ఇద్దరు మరో పార్టీకి చెందిన వారు. మరో ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు’’ అని డీజీపీ చెప్పగా.. వాళ్లు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు.
దీనికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇచ్చిన సమాధానం.. ‘మీకు నోట్ ఇస్తున్నాం. అందులో వివరాలు ఉన్నాయి’ అని చెప్పారు. అంతే తప్పించి.. రాజకీయ పార్టీల పేర్లు చెప్పటానికి ఇష్టపడలేదు. మీడియాకు ఇచ్చిన నోట్ ను పరిశీలిస్తే.. నిందితుల్లో టీడీపీకి చెందిన వారు 17 మంది.. బీజేపీతో సంబంధం ఉన్న వారు నలుగురు ఉన్నట్లుగా తేలింది. అయితే.. ఈ తొమ్మిది కేసుల్లో దేవతామూర్తుల్నిధ్వంసం చేయటం కాదు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకే కేసులు నమోదు చేసినట్లుగా ‘నోట్’ లో ఉండటం విశేషం.
పోలీస్ బాస్ ఇచ్చిన నోట్ లో.. తొమ్మిది కేసుల వివరాల్ని వెల్లడించారు. అందులో ఏడు కేసులకు సంబంధించి.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు టీడీపీ.. బీజేపీ శ్రేణులపై కేసులు పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇక.. మిగిలిన రెండు కేసుల విషయానికి వస్తే.. ఒక దాన్లో భూవివాదం.. రెండోదాన్లో గుప్త నిధుల వ్యవహారం ఉన్నట్లుగా తేలింది. ఇలా చెప్పిన మాటకు.. ఇచ్చిన నోట్ లోని అంశాలకు పొంతన లేకపోవటం ఏమంటారు?