Begin typing your search above and press return to search.
నాందేడ్ బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడారు?
By: Tupaki Desk | 5 Feb 2023 5:42 PM GMTటీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన గులాబీ బాస్ కేసీఆర్.. తన జాతీయ పార్టీ ఏర్పాటు అనంతరం వేరే రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మొదటిబహిరంగ సభకు మహారాష్ట్రలోని నాందేడ్ వేదికగా మారింది. ఈ సభలో మాట్లాడిన కేసీఆర్ ఎప్పటిలానే.. మోడీ సర్కారుపై విరుచుకుపడటమే కాదు.. దేశానికి ఉన్న అవకాశాల్ని చెప్పుకొచ్చారు.
భారత్ పేద దేశం కాదని.. అమెరికా కంటే ధనిక దేశమని.. భారత్ బుద్దిజీవుల దేశంగా అభివర్ణించారు. నాగలి పట్టే చేతులు శాసనాలు చేసే సమయం వచ్చేసినట్లుగా పేర్కొన్నారు.
దేశంలో ఉన్నంత సాగుకు ఆమోదయోగ్యమైన భూమి మరెక్కడా లేదన్న కేసీఆర్..దేశ పరిస్థితుల్ని చూసిన తర్వాతే టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చినట్లుగా పేర్కొన్నారు.
నాందేడ్ లోని సచ్ ఖండ్ బోడ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా పాల్గొన్న కేసీఆర్ తన ప్రసంగంలో ఛత్రపతి శివాజీ.. అంబేడ్కర్ .. పూలే లాంటి మహనీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి మహారాష్ట్రలో సభను నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. ఆయన ఉపన్యాసంలోని ముఖ్య అంశాల్ని చూస్తే..
- దేశానికి స్వాత్యంత్రం వచ్చి 75 ఏళ్లు అయ్యింది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు. కానీ.. ఆ మేరకు మార్పులు రాలేదు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కనీసం తాగునీరు.. విద్యుత్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి.
- మహారాష్ట్రలో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించినా ఆత్మహత్యలు తప్పట్లేదు. ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదు. ప్రజలు.. రైతులు గెలవాలి.
- భారత్ పేద దేశం ఎంతమాత్రం కాదు. భారత్ అమెరికా కంటే ధనిక దేశం. భారత్ లో వనరులు ఉన్నా.. ప్రజలు వంచనకు గురి అవుతుననారు. భారత్ లో ఉన్నంత సాగు ఆమోదయోగ్యమైన భూమి మరెక్కడా లేదు.
- మహారాష్ట్రలో ఇన్ని నదులు ఉన్నా నీటి కరవు ఎందుకు? స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ 54 ఏళ్లు.. బీజేపీ 16 ఏళ్లు పాలించాయి. ఆ పార్టీలు ఏం సాధించాయి? ఆ రెండు పార్టీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి. నువ్వు అంత తిన్నావంటే.. నువ్వు ఇంత తిన్నావని తిట్టుకుంటున్నాయి.
- పంతంగులు.. మాంజాలు.. దైవ ప్రతిమలు ..చివరకుజాతీయ జెండాలు సైతం చైనా నుంచే వస్తున్నాయి. దేశమంతా చైనా బజార్లు ఎందుకు ఉన్నాయి? నాందేడ్ లో ఎన్ని చైనా బజార్లు ఉన్నాయో లెక్క పెట్టారా. బీఆర్ఎస్ చేస్తున్నది రాజకీయ పోరాటం కాదు. జీవన్మరణ పోరాటం.
- ప్రపంచంలోనే అతి పెద్ద రిజర్వాయర్ చిన్న దేశంలో ఉంది. సువిశాల భారత్ లో కనీసం 2 వేల టీఎంసీలు రిజర్వాయర్ ఎందుకు లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించటం లేదు. ట్రైబ్యునళ్ల పేరుతో ఏళ్ల కొద్దీ జలవివాదాల్ని పెండింగ్ లో పెడుతున్నారు. ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా తిప్పుతున్నారు.
- చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చు. గట్టిగా అనుకుంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వొచ్చు.
- 8 ఏళ్ల క్రితం తెలంగాణలోనూ ఎన్నో సమస్యలు ఉండేవి. సాగునీరు.. తాగునీరు.. విద్యుత్ కొరత ఉండేది. క్రమంగా అన్ని సమస్యల్ని అధిగమించాం. తెలంగాణలో సాగుకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రైతుకు ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు చొప్పున రైతుబంధు ఇస్తున్నాం. రైతు ఏ కారణంతో చనిపోయినా రూ.5 లక్షలు బీమా ఇస్తున్నాం.
- తెలంగాణలో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీళ్లు ఇస్తున్నాం. ఇవన్నీ తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు? ఇలాంటి పథకాలు కావాలంటే రైతు సర్కారు రావాలి.
- దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కేవలం బొగ్గుతోనే దేశం మొత్తానికి 24 గంటలు విద్యుత్ ఇవ్వొచ్చు. బీఆర్ఎస్ కు అధికారం ఇస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్ ఇస్తాం. బీఆర్ఎస్ చేతికి అధికారం వస్తే దేశమంతా రైతుబంధు.. దళితబంధు అమలు చేస్తాం.
- పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు రైతులు. అందుకే అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అనే నినాదంతో మేం వచ్చాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.