Begin typing your search above and press return to search.
బెజవాడ మీడియా సమావేశంలో జగ్గారెడ్డి ఏం చెప్పారు?
By: Tupaki Desk | 30 Jan 2021 3:26 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు చాలామందే ఉన్నారు. కానీ.. కొద్దిమంది కాస్త భిన్నం. అలాంటి భిన్నమైన తీరును ప్రదర్శించే రాజకీయ నేతల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి ఒకరు. తెలంగాణలోని నేతలు పార్టీలకు అతీతంగా ప్రత్యేక రాష్ట్రం కోరుకున్న వేళలో.. జగ్గారెడ్డి ఒక్కరు మాత్రమే సమైక్యవాదాన్ని వినిపించేవారు. భావోద్వేగంతో తెలంగాణ ప్రజలంతా రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని.. ఏళ్లకు ఏళ్లుగా తమకు జరిగిన అన్యాయాన్ని సరి చేయాలని బలంగా తమ వాదనను వినిపిస్తున్న వేళ.. వారి వాదనకు భిన్నమైన వాదనను వినిపించేందుకు ఏ తెలంగాణ నేత సిద్ధంగా లేని వేళలోనూ జగ్గారెడ్డి తన సమైక్య గళాన్ని వినిపించేవారు.
అలాంటి విలక్షణమైన రాజకీయ నేత జగ్గారెడ్డి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ప్రత్యేకమైన అభిమానం. అలాంటి ఆయన.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఇన్నాళ్లకు బెజవాడలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు కలలో కూడా ఊహించని మాటల్ని.. ఎంతోనమ్మకంగా చెప్పిన జగ్గారెడ్డి మాటల్ని చూస్తే..
‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను దివంగత రాజశేఖరరెడ్డి సమానంగా అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవద్దని నేను ముందు నుంచి కోరుకున్నా’’
‘‘రాష్ట్రం విడిపోవద్దని సీమాంధ్రులు, విడిపోవాలని తెలంగాణ కోరుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ ఏపీకి నష్టం చేయలేదు’’
‘‘రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకు కోపం వచ్చింది. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని.. అప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అన్ని కులాలు, మతాలను కలుపుకుని పోయే పార్టీ కాంగ్రెస్ మాత్రమే’’
‘‘కాంగ్రెస్‌కు ఏపీ ప్రజలు అధికారాన్ని ఇవ్వాలి. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి టీడీపీ, రెండోసారి వైసీపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం. ఏపీలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది’’