Begin typing your search above and press return to search.

అనిల్ బ్రోకి జగన్ ఏమి చెప్పారంటే....?

By:  Tupaki Desk   |   26 Jun 2023 10:22 PM GMT
అనిల్ బ్రోకి జగన్ ఏమి చెప్పారంటే....?
X
నెల్లూరు రాజకీయాలు వైసీపీ లో మంటపుట్టిస్తున్నాయి. కంచుకోట జిల్లాలో అగ్గి రాజుకుంటోంది. వైసీపీ నుంచి ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేల ను సస్పెండ్ చేశారు. ఇపుడు నెల్లూరు సిటీ లో అనిల్ కుమార్ యదావ్ రచ్చ సాగుతోంది. ఆయనకు బయట ప్రత్యర్ధులతో పాటు సొంత పర్టీ లోని ప్రత్యర్ధులు ఉన్నారు. మరీ ముఖ్యంగా సొంత బాబాయ్ రూప్ కుమార్ తోనే వైరం వచ్చిపడింది.

దాంతో అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల ఆత్మీయ సభ పెట్టి మరీ గట్టి హెచ్చరికల ను జారీ చేశారు. తన గెలుపు ను ఎవరూ అడ్డుకోలేరని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆయన మాజీ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ని సైతం సవాల్ పేరుతో లాగారు. అటు నుంచి కూడా లోకేష్ సహా కీలక నేతల తో రివర్స్ అటాక్ వచ్చింది.

ఈ నేపధ్యంలో నెల్లూరు సిటీలో అసలు ఏమి జరుగుతోంది అన్న దాని మీద ముఖ్యమంత్రి జగన్ స్వయంగా అనిల్ కుమార్ యాదవ్ ని పిలిపించుకుని మరీ కీలక భేటీ వేశారు. ఏకంగా నలభై అయిదు నిముషాల పాటు సాగిన ఈ భేటీ లో చాలా విషయాలే చర్చకు వచ్చాయని అంటున్నారు.

నెల్లూరు సిటీ లో వైసీపీ పరిస్థితి ఎలా ఉందో జగన్ కి అనిల్ వివరించారు అని అంటున్నారు నెల్లూరు సిటీ లో మరోమారు విజయం సాధించాలని జగన్ అనిల్ కి సూచించారు అని అంటున్నారు. అంతే కాదు అందరూ ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీ కోసం కృషి చేయాలని కూడా కోరారని అంటున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి గురించి కూడా అనిల్ ముఖ్యామంత్రికి వివరించారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పెండింగు పనుల కు అభివృద్ధి నిధుల ను వెంటనే మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అధికారుల ను ఆదేశించారు. నిధులు విడుదల మాత్రమే కాదు తక్షణమే పనులు పూర్తి చేయాలని కూడా ఆయన సూచించారు అని అంటున్నారు.

ఇక ఎలాంటి విభేదాల కు తావు లేకుండా నెల్లూరు సిటీలో పార్టీని ఏకత్రాటిమీద నడిపించాలని అనిల్ కి జగన్ సూచించారు అని తెలుస్తోంది. మరి జగన్ తో భేటీ తరువాత అనిల్ ఉత్సాహంగా కనిపించారు అంటే ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఖాయమా అన్న చర్చ అయితే సాగుతోంది.

అనిల్ కి ఈసారి టికెట్ ఇవ్వరని అంటున్నా జగన్ తో భేటీ సందర్భంగా తాను గెలుచుకుని వస్తాను అని అనిల్ మాట ఇచ్చారని అంటున్నారు మరి ఇంకా ఎన్నికల కు సమయం ఉంది కాబట్టి అనిల్ బ్రోకి కొంత సమయం ఇచ్చి చూద్దామని జగన్ భావిస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏది ఏమైనా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ మంటను పుట్టించి ఎట్టకేల కు సీఎం దాకా తన సమస్యలను అన్నీ తీసుకెళ్ళగలిగారు అని అంటున్నారు.