Begin typing your search above and press return to search.

దిశ రవిపై దేశద్రోహం కేసు పెట్టిన వైనంపై కోర్టు ఏమన్నదంటే?

By:  Tupaki Desk   |   24 Feb 2021 5:30 AM GMT
దిశ రవిపై దేశద్రోహం కేసు పెట్టిన వైనంపై కోర్టు ఏమన్నదంటే?
X
పెను సంచలనంగా మారిన టూల్ కిట్ కేసులో పర్యావరణ కార్యకర్త.. యువ ఉద్యమ నేత దిశ రవి గడిచిన కొద్ది రోజులుగా వార్తల్లో వ్యక్తిగా మారారు. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన టూల్ కిట్ ఉదంతంలో ఆమె దేశ ద్రోహం కేసును ఎదుర్కోవటం తెలిసిందే. దీనిపై కేంద్ర సర్కారుకు అనుకూలంగా కొందరు వ్యాఖ్యలు చేస్తే.. మరికొందరు బీజేపీ స్టాండ్ ను వారు తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. దిశ రవిపై దేశద్రోహం సెక్షన్లను నమోదు చేయటంపై వామపక్ష వాదులంతా తీవ్రంగా తప్పు పడుతున్నారు.

ఆమెకు ఖలిస్తాన్ తో సంబందాలు ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. తనపై చేసినన ఆరోపణలపై కోర్టును ఆశ్రయించారు. తాజాగా పటియాల హౌస్ లోని ఒక కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. మంగళవారం విచారణ సందర్భంగా ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ కు కోర్టు ఓకే చెప్పింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరును తప్పు పట్టింది.

పోలీసులు సమర్పించిన ఆధారారాలు అరకొరగా.. రేఖా మాత్రంగా ఉన్నాయని.. సహేతుకంగా లేవన్నారు. ఆమెపై నేర చరిత్ర లేదన్నారు. ఖలిస్థాన్ ఉద్యమానికి ఊతమిస్తోందన్న ఆరోపణలపై కోర్టు నిలదీసింది. ఆమెకు ఆ సంస్థతో సంబంధం ఉన్నట్లుగా చూపించే ఆధారాలు ఏమీ లేవని ప్రశ్నించింది. దేశాన్ని అప్రదిష్ఠపాలు చేసేందుకు ఆమె కుట్ర పన్నారని.. అందుకు సంబంధించిన రెండు వెబ్ సైట్లను తనకు చూపించినట్లుగా న్యాయమూర్తి పేర్కొన్నారు.

‘అందులో అభ్యంతరకరమైనవేవీ నాకు కనిపించలేదు. ఆలోచనలు తప్పు కావొచ్చు. అతిశయోక్తి ఉండొచ్చు. చివరకు గొడవలకు దారి తీసేవి ఉండొచ్చు. కానీ.. హింసను ప్రేరేపించనంత కాలం.. వాటిని దేశద్రోహం కింద జమ కట్టటం కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆమె బెయిల్ కు పోలీసులు అడ్డుపడటం కేవలం అలంకార ప్రాయంగా ఉందన్నారు. లక్ష రూపాయిలతో పూచీకత్తుతో పాటు రెండు సమానమైన హామీల్ని కూడా సనమర్పించాలని ఆదేశించారు. లక్ష రూపాయిల పూచీకత్తు కట్టే స్తోమత లేదని పేర్కొనటం గమనార్హం. ఇదిలా ఉండగా.. కోర్టు ఇచ్చిన బెయిల్ తో ఆమెను మంగళవారం రాత్రి జైలు నుంచి విడుదల చేశారు.