Begin typing your search above and press return to search.

ఇక‌.. ఏపీ బ‌డ్జెట్‌.. వండి వార్చేదేంటి?

By:  Tupaki Desk   |   9 Feb 2023 4:00 PM GMT
ఇక‌.. ఏపీ బ‌డ్జెట్‌.. వండి వార్చేదేంటి?
X
దేశంలో 2023-24 వార్షిక బ‌డ్జెట్ అయిపోయింది. 42 ల‌క్ష‌ల కోట్లతో మోడీ స‌ర్కారు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టింది. ఇక‌.. మ‌రో పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా 2.9 ల‌క్ష‌ల కోట్ల‌తో రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టింది. ఇక‌, ఇప్పు డు మిగిలింది.. అంద‌రూ ఎదురు చూస్తున్న‌ది కూడా ఏపీ వార్షిక బ‌డ్జెట్ కోస‌మే. తెలంగాణ బ‌డ్జెట్‌ను చూసుకుంటే.. ఇదే ఆఖ‌రి బ‌డ్జెట్‌. పైగా.. న‌వంబ‌రు.. డిసెంబ‌రు వ‌ర‌కే దీని కాల‌ప‌రిమితి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఎన్నికల బ‌డ్జెట్‌గా దీనిని రూపొందించారు.

అన్ని వ‌ర్గాల‌కు తాయిలాలు ప్ర‌క‌టించారు. వివిధ ప‌థ‌కాల‌కు భారీ ఎత్తున కేటాయింపులు చేశారు. ఇది ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు ఏపీ బ‌డ్జెట్ ఎలా ఉంటుంది. ఏయే వంట‌కాల‌తో దీనిని వండివార్చ‌నున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ఏపీ అప్పులు చూసుకుంటే.. 4 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగానే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏటా వేల కోట్ల‌రూపాయ‌ల వ‌డ్డీ చెల్లింపులు వెక్కిరిస్తున్నాయి. ఇక‌, రాష్ట్రంలో రాజ‌ధాని లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. మ‌రోవైపు సంక్షేమాన్ని మ‌రింత పుంజుకునేలా చేయాల‌ని.. త‌మ‌ది సంక్షేమ ప్ర‌భు త్వమ‌ని.. మ‌రోవైపు వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. అంటే.. ఈసారి బ‌డ్జెట్‌లోనూ.. సంక్షేమ ప‌థ‌కా ల‌కు పెద్ద‌పీట వేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

అదేస‌మ‌యంలో జ‌గ‌న‌న్న ఇళ్లు.. మీ భూమి -మీహ‌క్కు వంటి ప‌థ‌కాల‌కు కూడా భారీ ఎత్తున కేటాయింపులు చేయ‌డం ద్వారా ఆయా ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్ల‌లోకి తీసుకువెళ్లి.. ఎన్నిక‌ల ముందు.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం జోరుగా చేయ‌నున్నారు.

అయితే..ఇప్పుడు ఆదాయ మార్గాలేంటి? అన్న‌ది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. మ‌ద్యంపైనే రాష్ట్రానికి ఇప్పుడు ప్ర‌ధాన ఆదాయం ఉంది. అదేస‌మ‌యంలో అప్పులు. ఈ రెండింటి ని బ‌డ్జెట్‌లో ప్ర‌ధానంగా ప్ర‌స్తా వించాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది.

ఎన్నిక‌ల‌కుముందు పూర్తిస్థాయి చివ‌రి బ‌డ్జెట్ కావ‌డం.. ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కి రికార్డు సృష్టించాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్న ద‌రిమిలా.. ఇప్పుడు వైసీపీ ఏం చేయ‌నుంద‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రి చూడాలి ఏం చేస్తారో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.